Divvala Madhuri: దివ్వెల మాధురి సోషల్ మీడియాలో సంచలనం అనే చెప్పాలి. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వచ్చిన గొడవలకు ఈమెనే కారణం. బిగ్ బాస్‌కి వెళ్లొచ్చాక మరింత ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె రీతూ గురించి కొన్ని కామెంట్లు చేసింది.
దువ్వాడ శ్రీనివాస్ పేరు చెబితే దివ్వెల మాధురి పేరు ఇట్టే గుర్తొస్తుంది. వీరిద్దరి గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమో. సోషల్ మీడియా ఇంటర్వ్యూలు, కుటుంబ గొడవలతో వీరు చాలా ఫేమస్ అయిపోయారు. అందుకే దివ్వెల మాధురికి బిగ్ బాస్‌లో కి వెళ్లే ఛాన్స్ కూడా వచ్చింది. ఇప్పుడు మాధురి చిన్న రీల్ చేసినా చాలు బోలెడన్ని లైకులు, భయంకరమైన కామెంట్లు వస్తాయి. రెండు వారాలు పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండి వచ్చింది. ఆ రెండు వారాల్లోనే ఎన్నో గొడవలు, అరుపులు, తిట్లు ఇలా ఎంటర్టైన్మెంట్ ఎక్కువే ఇచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రీతూ గురించి కొన్ని కామెంట్లు చేసింది.
24
తమన్నా సింహాద్రి చెప్పింది
దివ్వెల మాధురి పుట్టినరోజు కావడంతో ఒక యూట్యూబ్ వార్త ఛానల్ వారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అందులో రీతు గురించి మాట్లాడింది. రీతూ చౌదరి తల్లి డిమోన్ పవన్ తో దూరంగా ఉండమని తన కూతురుకు చెప్పమందని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మాధురి అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే విషయం గురించి తాజాగా మాధురి క్లారిటీ ఇచ్చింది. తనకు తమన్నా సింహాద్రి అనే అమ్మాయి ఫోన్ చేసి రీతూను పవన్ కు దూరంగా ఉండమని రీతూ తల్లి చెప్పమందని రిక్వెస్ట్ చేసినట్టు తెలిపింది. అదే తాను బిగ్ బాస్ లోకి వెళ్ళాక చెప్పానని వివరించింది. కానీ ఇప్పుడు రీతూ తల్లి నేను అలా చెప్పలేదని అంటోందని, ఏ తల్లి అయినా కూడా అలాగే చెబుతుందని మాధురి అది. ఇప్పుడు రీతు తల్లికి తన కూతురు చేస్తున్నది సరైనదనిపిస్తుందేమో.. అందుకే అలా స్పందించి ఉంటుందని మాధురి వివరించింది.
34
రీతూ రోత పనులు చూడలేకపోయా
అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, బయటకు వచ్చాక కూడా ఈ విషయం మాట్లాడుకుంటారు కాబట్టి అబద్ధం ఎందుకు చెబుతానని ప్రశ్నించింది మాధురి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తనకు కూడా కొన్ని విషయాలు చాలా ఇరిటేటింగ్ గా అనిపించాయని, నా ముందే వాళ్ళు చేసినా రోత పనులు చూడలేకపోయాను అంటూ డిమోన్ పవన్, రీతూ గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. ఆ విషయంలో తనకి నచ్చక అరిచానని, మొన్న సంజనా కూడా క్వశ్చన్ చేసిందని... అందులో తప్పేముందని అంది. హౌస్ లో ఏం జరిగితే అదే కదా మాట్లాడతామని మాధురి వివరించింది. తమన్నా సింహాద్రికి ఫోన్ చేసి నువ్వు చెప్పమంటేనే నేను చెప్పాను, మళ్లీ ఇంటర్వ్యూలో రీతూ తల్లి అలా చెప్పడ ఏంటని అడిగినట్టు మాధురి చెప్పింది.
మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఏ తల్లి అయినా తాను చెప్పలేదని అంటుందని, రీతు తల్లి మీడియా వాళ్లతో అబద్ధం చెపుతోందని మాధురి అంది. కొంతమంది యూట్యూబ్లో కూడా దారుణంగా ప్రశ్నలు వేస్తున్నారని, కనీస విలువలు కూడా పాటించడం లేదని అంది. నా గురించి మాట్లాడితే టిఆర్పి రేటు వస్తుందని, పాపులర్ అయిపోతామని అలా చేస్తూ ఉంటారని... నా గురించి మాట్లాడే రైట్ యూట్యూబర్లకు ఏముంది అని ప్రశ్నించింది మాధురి.