రిషి కోసం చీర వద్దన్న వసు.. మనసులో ప్రేమను బయట పెట్టకుండా కుమిలిపోతున్న రిషి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 30, 2021, 10:41 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. పైగా రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
16
రిషి కోసం చీర వద్దన్న వసు.. మనసులో ప్రేమను బయట పెట్టకుండా కుమిలిపోతున్న రిషి!

జగతి ఇంట్లో శిరీష్, అమూల్య (Sireesh, Amulya) ల ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వేడుక వసు, శిరీష్ మధ్య జరుగుతుందని రిషి అనుకోవడం తో రిషి (Rishi) వసు కోసం చాలా బాధపడుతుంటాడు. తనకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అని తన పై కోపంతో ఉంటాడు.
 

26

ఇక వసు అమూల్యను రెడీ చేయగా అమూల్య కూడా వసుని (Vasu) చీర కట్టుకొమని అంటుంది. జగతి మేడం వచ్చి వసు ని చీర కట్టుకొని అనటంతో వెంటనే గతంలో తను చీర కట్టుకొని కింద పడుతున్న సమయంలో రిషి (Rishi) వచ్చి పట్టుకున్న సీన్ గుర్తు చేసుకొని తనను చీర మళ్ళీ ఎప్పుడు కట్టుకోవద్దని అన్న మాటలు తలుచుకొని రిషి కోసం చీర కట్టుకోకుండా ఉంటుంది.
 

36

మరోవైపు శిరీష్ (Sireesh) ను మహేంద్రవర్మ రెడీ చేస్తూ పంచె కట్టు అందాన్ని వర్ణిస్తాడు. రిషి సార్ ఇంకా రాలేదా అని శిరీష్ అడగటంతో వస్తున్నాడు అన్నట్లు సమాధానం ఇస్తాడు. కానీ రిషి (Rishi) మాత్రం వసు మాటలను తలుచుకుంటూ ప్రయాణం చేస్తాడు. ఎందుకిలా చేస్తుంది అని వసును పదే పదే తలుచుకుని బాధ పడుతుంటాడు.
 

46

ఇక జగతి (Jagathi) ఇంట్లో శిరీష్, అమూల్య పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. జగతి, మహేంద్ర వర్మ, వసు అమ్మాయి, అబ్బాయిల తరఫున, పెళ్లి పెద్ద తరఫున ఉంటారు. రిషి (Rishi) నేరుగా జగతి ఇంటికి వచ్చి కారు హారన్ కొట్టడంతో వెంటనే వసు పరిగెత్తుకెళ్లి రిషి ని చూసి మురిసిపోతుంది. ఇక వసు గెటప్ చూసి రిషి బాధపడతాడు. అప్పుడే అమూల్య కొద్దిసేపు ఇంట్లోకి వెళ్లి పోతుంది.
 

56

వసు (Vasu) రిషిని ఇంట్లోకి తీసుకెళ్తుండగా అక్కడ శిరీష్,  మహేంద్రవర్మ ను చూసి ఆగిపోతాడు. శిరీష్ (Sireesh) వసును పిలవడంతో తట్టుకోలేక అక్కడనుంచి వెళ్ళి పోతాడు. వసు ఎంత పిలిచినా వినకుండా వెళ్ళిపోతాడు. ఇంట్లో  ఎంగేజ్మెంట్ అవుతుండగా మహేంద్ర వర్మ రిషి, వసు ఎంగేజ్మెంట్ లాగా తలచుకుంటాడు.
 

66

మొత్తానికి ఎంగేజ్మెంట్ పూర్తి అవ్వగా అమూల్య, శిరిష్ థాంక్స్ చెప్పుకుంటారు. కాసేపు  సరదాగా మాట్లాడుకుంటారు. రిషి (Rishi) ఓ దగ్గరికి వెళ్లి వసు గురించి తలుచుకొని కుమిలిపోతాడు. మళ్లీ జగతి ఇంటికి వచ్చి దూరంగా శిరీష్, వసులు మాట్లాడుతున్న సీన్ చూసి తట్టుకోలేక హారన్ కొడతాడు. వెంటనే వసు (Vasu) బయటకి చూస్తుంది.

click me!

Recommended Stories