ఇక మంచు విష్ణు మాత్రం కన్నప్ప సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. కొన్నేళ్ల నుంచి మంచు ఫ్యామిలీకి హిట్ సినిమా లేదు. మంచు విష్ణు సాలిడ్ హిట్ కొట్టి ఎంత కాలం అయ్యిందో ఎవరికీ గుర్తుకూడా లేదు. కాని ఈసారి కాస్త గట్టిగానే కొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
కన్నప్ప సినిమాతో పాన్ ఇండియాను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మంచు ఫ్యామిలీ మాత్రమే కాదు ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ సందడి చేయబోతున్నారు. ఈ నెల 27 రిలీజ్ కాబోతోంది ఈమూవీపై భారీ అచనాలు ఉన్నాయి.