Intinti Gruhalakshmi: దివ్య, విక్రమ్ మధ్య రొమాంటిక్ మూమెంట్.. రాజ్యలక్ష్మి మాటలకు కోపంతో రగిలిపోతున్న ప్రియ?

Published : Apr 07, 2023, 09:38 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

PREV
17
Intinti Gruhalakshmi: దివ్య, విక్రమ్ మధ్య రొమాంటిక్ మూమెంట్.. రాజ్యలక్ష్మి మాటలకు కోపంతో రగిలిపోతున్న ప్రియ?

ఈరోజు ఎపిసోడ్ లో విక్రమ్ దివ్యని పక్కకు రమ్మని సైగలు చేస్తూ ఉంటాడు. అప్పుడు దివ్య పరంధామయ్య అనసూయలకు ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్తుండగా విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు దివ్య కూడా అక్కడికి వెళుతుండగా ఇంతలో తులసి వచ్చి నీకు ఒక మంచి చీర చూశాను కదా అని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు దివ్య తులసి మాటలు పట్టించుకోకుండా అక్కడ విక్రమ్ ఒక్కడే ఉన్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ అటువైపే చూస్తూ ఉంటుంది. ఇంతలోనే డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఒక అమ్మాయి ఏంటో ఎన్ని మంచి డ్రెస్సులు వేసుకున్నావు ఒక అబ్బాయి కూడా నా వైపు చూడడం లేదు కనీసం ఈ డ్రెస్ తో అయినా ఒక అబ్బాయిని నా వైపు చూస్తాడేమో అనుకుంటూ విక్రం ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళుతూ ఉంటుంది.
 

27

మరోవైపు విక్రమ్ ఎలా అయిన దివ్య కౌగిలించుకోవాలి అని డ్రెస్సింగ్ రూమ్ లో లైట్ ని ఆఫ్ చేస్తాడు. అప్పుడు వేరే అమ్మాయి వస్తుండగా విక్రమ్ దివ్యనే వస్తుంది అనుకుంటూ ఉంటాడు. మరోవైపు దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వచ్చింది దివ్య అనుకుని వెనకనుంచి వాటేసుకొని ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చావా అనుకుంటూ ఉంటాడు విక్రమ్. అప్పుడు ఆ అమ్మాయి ఇన్నాళ్లకు నాకు బాయ్ ఫ్రెండ్ ని దొరికించావా స్వామి చాలా థాంక్స్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అమ్మాయి, ఇద్దరూ భ్రమ పడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నీ ముఖంలో సిగ్గు ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని విక్రమ్ అనడంతో వద్దు బాబు నాకు లైట్ వేస్తే సిగ్గు అని అంటుంది ఆ అమ్మాయి.
 

37

అదేంటి ఆల్రెడీ మన ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నాము కదా అనగా నాకు ఒక మాట కూడా చెప్పకుండా ముహూర్తం ఫిక్స్ చేసావా నాటి అని అంటుంది. నీ వాయిస్ ఏదో చేయలా కొడుతుంది ఒక్క నిమిషం ఆగు అని లైట్ వేయగా అక్కడ దివ్య కాకుండా కావ్య అనే అమ్మాయి ఉండడంతో అది చూసి షాక్ అవుతాడు విక్రమ్. మరోవైపు దివ్య ట్రైలర్ రూమ్ వైపు చూస్తుండగా అక్కడికి మల్ల వెళ్లొచ్చు కానీ ఈ సారి ఎలా ఉందో చెప్పు అని అంటుంది తులసి. ట్రైలర్ రూమ్లో ఇందాక నువ్వే నన్ను పట్టుకుని ఇప్పుడు వదిలేయమంటావేంటి అంటూ విక్రమ్ వద్దు అంటున్న కూడా పట్టుకుని కాళ్ళు లాగుతూ ఉండగా అది చూసి దివ్య నవ్వుకుంటూ ఉంటుంది.
 

47

అప్పుడు సరే పద అని దివ్య అని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది తులసి. మరోవైపు విక్రం ఆ అమ్మాయి నుంచి తప్పించుకొని దివ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దివ్య ముందు చీరలు అన్ని పెట్టి ఒక్కొక్కటి సెలెక్ట్ చేయమని రెండు చేతుల్లో చీరలు పట్టుకుని విక్రమ్ వైపు చూడగా అది చూస్తున్న నందు తులసి వైపు సైగలు చేసి చూపిస్తాడు. అప్పుడు విక్రమ్ సెలెక్ట్ చేసిన చీరని అందరూ సెలెక్ట్ చేస్తారు. అప్పుడు చీరలన్నీ విక్రం దూరం నుంచి సెలెక్ట్ చేస్తుండగా అదే అందరూ ఫైనల్ చేయడంతో దివ్య ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు ఒకసారి పక్కకురా దివ్య అని విక్రమ్ పిలవడంతో అమ్మ ఈ డ్రెస్ ట్రై చేసుకుని వస్తాను అని దివ్య అబద్ధం చెబుతుంది. అప్పుడు అందరికీ అసలు విషయం అర్థమయ్యి సరే అని అంటారు.
 

57

 అప్పుడు దివ్య విక్రమ్ ట్రైలర్ రూమ్ లోకి వెళ్ళగా ఇప్పుడు మనం వెళ్ళాం పదండి అని అనసూయ అందర్నీ పిలుచుకొని అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడు విక్రమ్, దివ్య లోపల రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉండగా బయటనుంచి తులసి, అనసూయ, లాస్య వారి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్యకి పిల్లి అంటే భయం అని తెలిసి బయట నుంచి అనసూయ పిల్లి లాగా అరుస్తూ ఉండడంతో దివ్య భయపడుతూ ఉండగా నేనున్నాను కదా ఎందుకు భయం అని అంటాడు విక్రమ్. అప్పుడు సరే అని విక్రమ్, దివ్య ఇద్దరు రొమాంటిక్ గా దగ్గరవుతుండగా అనసూయ మళ్లీ పిల్లి లాగా అరవడంతో టెన్షన్ తో దివ్య బయటికి వెళ్తుంది. అప్పుడు దివ్య బయటికి వెళ్లి అందరిని చూసి ఒకసారిగా షాక్ అవుతుంది.
 

67

 అప్పుడు అనసూయ బాబు ఇక నువ్వు బయటికి రావచ్చు అని అంటుంది. అప్పుడు విక్రమ్ సిగ్గుపడుతూ టెన్షన్ పడుతూ బయటకు వస్తాడు. అక్కడ అందర్నీ చూసి మొహమాటపడుతూ ఉంటాడు విక్రమ్. అందరూ సరదాగా మాట్లాడడంతో దివ్య విక్రమ్ లు ఇరుక్కుపోయామే అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు నేను వెళ్ళొస్తానండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. తర్వాత నందు బిల్ పే చేయడంతో అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత తులసికి రాజ్యలక్ష్మి ఫోన్ చేసి ఒక విషయంలో మీరు తప్పు చేస్తున్నారు అది మార్చుకోవాలి అనడంతో తులసి ఆలోచనలో పడుతుంది.
 

77

ఏంటి ఆలోచిస్తున్నారు అని రాజ్యలక్ష్మి అనగా నా సరిదిద్దుకుంటాను క్షమాపణ చెబుతాను తప్పు లేకపోతే ఆ దేవుడు చెప్పిన వినను అని అంటుంది తులసి. అప్పుడు రాజ్యలక్ష్మి కావాలనే దివ్య ముందు స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మీరు నన్ను గారు  అని పిలవడం బాగోలేదు అనడంతో తులసి అలవాటు పడాలి కదా అని అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి డబ్బులు మీనింగ్ మాట్లాడుతుండగా తులసికి అర్థం కాక నవ్వుతూ ఉంటుంది. నగలు పంపించాను దివ్యకు నచ్చాయా అనడంతో చాలా నచ్చాయి వదిన గారు అని అంటుంది తులసి. రేపు అల్లుడు గారికి బట్టలు పంపిస్తాను అని అంటుంది తులసి. అప్పుడు రాజ్యలక్ష్మి మాటలకు ప్రియా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

click me!

Recommended Stories