ఇక స్కూల్ కి వెళ్లిన చిన్మయి, దేవి అక్కడ పచ్చ పొడుస్తున్న వాళ్ళని చూస్తారు.. అప్పుడు దేవి నేను నాన్న పేరు పచ్చబొట్టు పొడిపించుకుంటాను అని అక్కడికి వెళ్తుంది. నాకు పచ్చబొట్టు వేస్తారా అని అడిగితే వేస్తాను అంటాడు. ఏం బొమ్మ వెయ్యాలమ్మ అని అడిగితే నాన్న పేరు వెయ్యి అంటే వేసే సమయంకు అక్కడికి భాగ్యమ్మ వచ్చి ఆపేస్తుంది. అతన్ని తిట్టి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది.