ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... లాస్య భాగ్య కలిసి తులసి చెప్పిన బంగ్లా దగ్గరకు వెళ్తారు.. అయితే ఆ బంగ్లా పూర్తిగా పాడుబడినది. దీంతో అందులో దెయ్యాలు ఉంటాయి అని భయపడుతూ ఉంటారు.. అయిన కూడా రంజిత్ ని పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో లోపలికి బయపడుతూనే వెళ్తారు. ఇక ఆలా వచ్చిన ఇద్దరినీ తులసి, దివ్య, అంకిత ముగ్గురు కలిసి బయపెడుతారు.