డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది అషురెడ్డి. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో, ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) బోల్డ్ ఇంటర్వ్యూతో ఒకసారిగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం చిన్నపాటి సెలబ్రెటీలా మారిపోయి తన క్రేజ్ మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.