బోల్డ్ బ్యూట్య్ అమీషా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో అమీషా పటేల్ కు తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి కూడా.
29
కానీ అమీషా పటేల్ టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. బాలీవుడ్ లో కూడా ఆమెకు అంతాగా కలసి రాలేదు. స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులర్ కాలేకపోయినప్పటికీ అవకాశాలు దక్కించుకుంది. ఇక అమీషా పటేల్ కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
39
47 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్ళు వెర్రెత్తిపోయే బికినీ ఫొటోస్ లో తన అందాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తోంది. కళ్ళు చెదిరే విధంగా గ్లామర్ స్టిల్స్ ఇస్తోంది. ఐదు పదుల వయసు సమీపిస్తున్నా అమీషా ఇంకా వివాహం చేసుకోలేదు.
49
నేడు అమీషా పటేల్ తన 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. అమీషా పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. బద్రి తర్వాత మహేష్ బాబుకి జోడిగా నానిలో నటించింది. అదికూడా ఆమెకి నిరాశనే మిగిల్చింది.
59
గ్యాప్ తీసుకుని బాలయ్యతో నటించిన పరమవీర చక్ర మూవీ డిజాస్టర్ గా నిలిచింది. మధ్యలో హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ ఏ చిత్రాలు ఆమెకి విజయాన్ని తెచ్చిపెట్టలేదు.
69
కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ బాంబులా గుర్తింపు సొంతం చేసుకుంది. తన పరువాలని తరచుగా ఆరబోస్తూ కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. ముఖ్యంగా క్లీవేజ్ షో చేయాలంటే అమీషా పటేల్ తర్వాతే ఎవరైనా అనేంతలా ఈ ముదురు బ్యూటీ రెచ్చిపోతోంది.
79
బికినీలు, షార్ట్ డ్రెస్సులు, టీజింగ్ సెల్ఫీలతో అమీషా సృష్టించే గ్లామర్ విధ్వసం అంతా ఇంతా కాదు. కెరీర్ ఆరంభంలో చిత్రాల్లో పద్దతిగా కనిపించిన అమీషా ఆ తర్వాత ఊహించని విధంగా ఉక్కపోత పెంచేస్తోంది.
89
ఇంతటి అందాల భామకి ఇంకా సరైన జోడి దొరకకపోవడం ఆశ్చర్యకరమే. ఆమె తండ్రి అమిత్ పటేల్, తల్లి ఆశా పటేల్.. ఇద్దరి పేర్లు కలసి వచ్చేలా ఆమెకి అమీషా అని నామకరణం చేశారు.
99
ప్రస్తుతం అమీషా పటేల్ సన్నీ డియోల్ సరసన గదర్ 2లో నటిస్తోంది. ఆగష్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 2001లో వచ్చిన గదర్ చిత్రానికి ఇది సీక్వెల్.