హాఫ్ సెంచరీ అయినా కొడుతుందా? బాహుబలి ది ఎపిక్ 5 రోజుల కలెక్షన్స్ ? ఎంత వసూలయ్యాయి ?

Published : Nov 05, 2025, 04:42 PM IST

ప్రభాస్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా 'బాహుబలి ది ఎపిక్. ఈ సినిమా రిలీజ్ అయ్యి.. 5 రోజులైంది. రీ రిలీజ్ వెర్షన్ అయినా సరే.. ఈమూవీకి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈక్రమంలో బాహుబలి సినిమా ఐదు రోజుల కలెక్షన్ల వివరాల చూస్తే..? 

PREV
14
బాహుబలి రీ రిలీజ్

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్' రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. రీరిలీజ్ రికార్డులను ఈసినిమా బ్రేక్ చేసింది. ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆడియన్స్ పోటీపడుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు 'బాహుబలి, 'బాహుబలి: ది బిగినింగ్'లను కలిపి 3 గంటలకు పైగా నిడివితో 'బాహుబలి ది ఎపిక్' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి.. 5వ రోజులు అవుతుండగా.. ఈమూవీ బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాలు సాధించింది, ఈ సినిమా కలెక్షన్ల వివరాలు sacnilk.com ప్రకారం బయలకు వచ్చాయి. గత ఐదురోజులుగా ఈమూవీ ఎంత కలెక్ట్ చేసిదంటే?

24
బాహుబలి ది ఎపిక్' 5 రోజుల కలెక్షన్స్

''బాహుబలి ది ఎపిక్' సినిమా ప్రీమియర్ గురువారం జరిగింది. సినిమా మొదటి రోజు, అంటే శుక్రవారం, .9.65 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు 7.25 కోట్ల వ్యాపారం చేసింది. మూడో రోజు కలెక్షన్లు .6.3 కోట్లుకాగా.. వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ భారీగా తగ్గడం కనిపించింది. ఇక నాలుగో రోజు .1.75 కోట్లు సంపాదించిన బాహుబలి.. ఐదో రోజు1.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ.27.60 కోట్ల వరకూ వసూళ్లను సంపాదించింది. ప్రపంచవ్యాప్త కలెక్షన్ల గురించి మాట్లాడితే, బాహుబలి ది ఎపిక్ మూవీ 41.85 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

34
కలెక్షన్స్ పెరుగుతాయా?

బాహుబలి సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈమూవీ వసూళ్లు వేగం పుంజుకోవచ్చని అంటున్నారు. సినిమా కలెక్షన్స్ తగ్గినా.. రీ రిలీజ్ విషయంలో రికార్డ్స్ ను బ్రేక్ చేసింది బాహుబలి. చాలా సినిమాలను ఓడించింది. సిద్ధాంత్ చతుర్వేది 'ధడక్ 2' లైఫ్‌టైమ్ నెట్ కలెక్షన్ 24.24 కోట్లను అధిగమించింది. దీనితో పాటు, రాజ్‌కుమార్ రావు గ్యాంగ్‌స్టర్ డ్రామా 'మాలిక్' 26.36 కోట్ల కలెక్షన్‌ను కూడా దాటేసింది బాహుబలి ది ఎపిక్. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లాంటి సీనియర్ తారలు సందడి చేశారు.

44
'బాహుబలి సినిమా రికార్డ్స్

బాహుబలి ది ఎపిక్' రెండు బాహుబలి సినిమాలు 'బాహుబలి: ది బిగినింగ్' (2015), 'బాహుబలి 2: ది కన్‌క్लूజన్' (2017)లను కలిపి ఎడిట్ చేసిన.. న్యూవ వెర్షన్. మొత్తం 5 గంటలకు పైగా ఉన్న ఈ సినిమా నిడివిని 3 గంటల 44 నిమిషాలకు తగ్గించారు. రీమాస్టరింగ్ ప్రక్రియలో, సినిమా విజువల్స్, సౌండ్ ట్రాక్‌ను మెరుగుపరిచారు, కొన్ని భాగాలను కత్తిరించారు. ఇక పదేళ్ల క్రితం అంటే 2015లో వచ్చిన 'బాహుబలి: ది బిగినింగ్' 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. దాదాపు 700 కోట్లు సంపాదించింది. తర్వాత 2017లో వచ్చిన 'బాహుబలి 2 మాత్రం 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది ఓవర్ ఆల్ గా 1810.60 కోట్ల వ్యాపారం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories