ఒకప్పుడు తెలుగు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలను ఊపేసిన హీరోయిన్.. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రవితేజ , నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చన వెంటనే.. కాస్త వయసు పెరిగిన హీరోయిన్లకు టైమ్ అయిపోతుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి, అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు.. ఫెయిడ్ అవుటు అయిన తరువాత వేరే దార్లు చూసుకుంటుంటారు. కొంత మంది పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత సినిమాలకు దూరమైపోతుంటారు. అలాంటి హీరోయిన్లు.. కాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరోయిన్స్.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నారు.
25
20 ఏళ్లుగా సినిమాలకు దూరం
ఈక్రమంలో తెలుగులో రవితేజ, నాగార్జున సరసన నటించి భారీ విజయాన్ని అందుకున్న ఓ హీరోయిన్ దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన ఆమె.. ఇప్పుడు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు రక్షిత. ఒకప్పుడు తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో రక్షిత ఒకరు. 2000ల ప్రారంభంలో వరుసగా విజయాలు అందుకున్న ఈ నటి, కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్‌బై చెప్పి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంచుకుంది. ప్రస్తుతం ఆమె వందల కోట్ల ఆస్తులకు యజమాని.
35
సినిమా కుటుంబం నుంచి..
రక్షిత 1984లో బెంగళూరులో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.సి. గౌరీశంకర్, తల్లి నటి మమతా రావు. చిన్నప్పటి నుంచే సినీమా వాతావరణంలో పెరిగిన రక్షిత 2002లో కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన అప్పు సినిమాతో కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒక్క సినిమాతో రక్షిత కన్నడలో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక వెంటనే ఆమెకు తెలుగులో అవకాశాలు వరుసగా వచ్చాయి. రవితేజ సరసన నటించిన ఇడియట్ సినిమా రక్షితకు భారీ హిట్ అందించింది. ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఆమెకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది.
ఇక తెలుగులో ఈ హీరోయిన్ కు ఆఫర్లు పెరిగాయి. అదే సమయంలో నాగార్జున, ఆసిన్‌తో కలిసి నటించిన శివమణి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో రక్షిత నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగు, కన్నడ భాషల్లో వరుస సక్సెస్ లతో.. మూవీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే రక్షిత సినిమాలను వదిలిపెట్టాల్సి వచ్చింది. 2007లో దర్శకుడు ప్రేమ్‌ను పెళ్లి చేసుకుని.. ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది రక్షిత. ఆతరువాత కొంత కాలానికి ప్రేమ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది.
55
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన రక్షిత
ప్రస్తుతం రక్షిత గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అధిక బరువుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె పలు కన్నడ టెలివిజన్ షోలలో జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అంతే కాదు కన్నడనాట ఆమె రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది. 2012లో శ్రీరాములు నేతృత్వంలోని బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, అనంతరం 2013లో జేడీఎస్ పార్టీలో చేరింది. తర్వాత 2014లో బీజేపీ పార్టీలో చేరి రాజకీయ జీవితం కొనసాగిస్తోంది.