రవితేజ కొత్త సినిమా టైటిల్ అదిరింది, ఓపినింగ్స్ మామూలుగా ఉండవు

First Published | Oct 28, 2024, 10:47 AM IST

మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా టైటిల్ 'మాస్ జాతర' అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

Raviteja, sreeleea, mass jathara


హిట్ , ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రెగ్యులర్ డైరక్టర్స్ కు అవకాసం ఇస్తూనే మరో వైపు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు..

మొన్న ఉగాది సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో రవితేజ ఈ సినిమాను ఒకే చేశాడు.. అయితే గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జోనర్ కాకుండా మళ్లీ తన మార్క్ కామెడిని ఈ సినిమా చూపించబోతున్నారు.. ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..అది మరోదే కాదు టైటిల్ 

Raviteja, sreeleea, mass jathara


రవితేజ హీరో గా భాను భోగవరపు ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఆమధ్య ఈ చిత్ర యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ సమయంలో రవితేజ గాయపడటంతో షూటింగ్‌ తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ సినిమా మళ్లీ షూట్ ప్రారంభమైంది.  ఇప్పుడాయన తిరిగి కోలుకోవడంతో సినిమాని పునఃప్రారంభించింది  చిత్ర టీమ్. దీనిలో భాగంగా ఈనెల 14నుంచి ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించాతరు. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో రవితేజతో పాటు ముఖ్య తారాగణంపై టాకీ పార్ట్‌ చిత్రీకరించనున్నట్లు తెలిసింది. 


Raviteja, sreeleea, mass jathara


యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇది వేసవి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.  ఇందులో ర‌వితేజ ల‌క్ష్మ‌ణ్ భేరీ అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

తెలంగాణ నేప‌థ్యంలో సాగే క‌థ‌. 2025 సంక్రాంతికి విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. అయితే ఇటీవ‌ల ర‌వితేజ‌కు గాయ‌మైంది. ఆప‌రేష‌న్ కూడా జ‌రిగింది. దాంతో ఈ సినిమా ఆల‌స్య‌మైంది. ఇప్పుడు 2025 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌కత్వంలో రూపొందే ఈ చిత్రానికి ‘మాస్ జాత‌ర‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. భాను మరెవరో కాదు‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ లాంటి హిట్ చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు.  ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు ఇదే మొదటి చిత్రం. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ధ‌మాకా’ చిత్రంతో భీమ్స్ బిగ్ లీగ్ లో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో పాట‌లు మాస్‌కు బాగా కిక్ ఇచ్చాయి. ఈ సినిమాతో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవ్వ‌బోతోంద‌ని చిత్ర‌ టీమ్ భావిస్తోంది. త్వ‌ర‌లోనే ‘మాస్ జాత‌ర‌’ టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయని సమాచారం. ఇదే నిజమైతే టైటిల్ కే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చి ఓపినింగ్స్ అదిరిపోతాయని తెలుస్తోంది.


సినిమా కామెడీ ఎంటర్టైనర్ కావటం, ధ‌మాకా త‌ర్వాత ర‌వితేజ‌, శ్రీలీల కాంబోలో తెర‌కెక్కుతోన్న మూవీ  కావటంతో ఖచ్చితంగా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. ద‌ర్శ‌కుడిగా భాను భోగ‌వ‌ర‌పుకు ఇదే మొద‌టి మూవీ అయినా గ‌తంలో చిరంజీవి, ర‌వితేజ కాంబోలో వ‌చ్చిన వాల్తేర్ వీర‌య్య‌కు భాను భోగ‌వ‌ర‌పు డైలాగ్స్ అందించాడు.

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చాడు. ర‌వితేజ మూవీతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయి సౌజ‌న్య నిర్మిస్తోంది.

Latest Videos

click me!