గోవా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఆయేషా టాకియా స్పందించింది. గొడవలో ఫర్హాన్ తుపాకీ తీశాడని ఆరోపణలు వచ్చాయి.
స్థానికులు వేధిస్తున్నారని, మహారాష్ట్ర నుండి వచ్చామని టార్గెట్ చేశారని ఆయేషా ఆరోపించింది. పోలీసులు కూడా తమకు వ్యతిరేకంగా వ్యవహరించారని తెలిపింది.
ఫర్హాన్‌ను స్థానికులు సవాలు చేయడంతో భయపడి పోలీసులకు ఫోన్ చేశాడు. సీసీటీవీ ఫుటేజీతో నిజం నిరూపిస్తామని ఆయేషా చెప్పింది.
ఫర్హాన్ అజ్మీ గతంలో కూడా గోవాలో గొడవల్లో ఉన్నాడు. 2022లో ఎయిర్‌పోర్ట్‌లో జాతి వివక్ష ఆరోపణలు చేశాడు.
Tirumala Dornala