'ధురందర్' ఫేమ్ ఆయేషా ఖాన్ తన కొత్త ఫొటోలతో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఓ మిస్టరీ మ్యాన్‌తో, చేతికి డైమండ్ రింగ్‌తో కనిపించడంతో ఆమెకు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే 'ఇదొక కల' అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ వెనుక అసలు కథ వేరే ఉందా?
ఆయేషా ఖాన్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇందులో ఉన్న మిస్టరీ మ్యాన్ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చేతికి మెరుస్తున్న డైమండ్ రింగ్ ఉండటంతో, ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద అడుగు వేసిందని అందరూ భావిస్తున్నారు. దీనికి తోడు 'ఇదొక కల' అని చిన్న క్యాప్షన్ పెట్టడంతో, ఇది ఎంగేజ్‌మెంట్ ప్రకటన అయ్యుంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే, ఆయేషా మాత్రం ఇప్పటివరకు తన ఎంగేజ్‌మెంట్ గురించి అధికారికంగా ఏమీ చెప్పలేదు.
23
జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్ ?
ఈ ఫొటోల్లో డైమండ్ రింగ్ హైలైట్ అయినా, దీని వెనుక మరో కారణం ఉండొచ్చని కొందరు అంటున్నారు. ఇదంతా ఒక జ్యువెలరీ బ్రాండ్ కోసం చేసిన ఫొటోషూట్ కావచ్చు. అందుకే అంత గ్లామరస్‌గా, రింగ్‌ను హైలైట్ చేస్తూ ఫొటోలు తీశారని భావిస్తున్నారు. ఆయేషా ఇటీవల రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురందర్' సినిమాలోని 'శరారత్' పాటతో బాగా పాపులర్ అయింది. ఈ పాటలో ఆమె, క్రిస్టల్ డిసౌజాతో కలిసి కరాచీ వెడ్డింగ్ బ్యాక్‌డ్రాప్‌లో డ్యాన్సర్లుగా అదరగొట్టారు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆ పాట షూటింగ్ రెండు రోజులు చాలా కష్టపడ్డానని, అలసిపోయి ఏడ్చేశానని, కానీ అవి 'ఖుషీ కే ఆంసూ' (ఆనందభాష్పాలు) అని ఆయేషా చెప్పింది. శరారత్ పాటకు శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించగా, మధుబంతి బాగ్చి, జాస్మిన్ శాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతానికి, ఆయేషా పోస్ట్ నిజంగా ఎంగేజ్‌మెంట్ కోసమా లేక జ్యువెలరీ యాడ్ కోసమా అనేది ఆమె చెప్తే గానీ తెలియదు.
33
Ayesha Khan
అయేషా ఖాన్ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. 2022లో ఆమె ముఖచిత్రం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నటించింది. అయేషా ఖాన్ సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన క్రేజీ సెలెబ్రిటీ. ధురంధర్ మూవీలో చేసిన స్పెషల్ సాంగ్ తో నేషనల్ వైడ్ పాపులారిటీ సొంతం చేసుకుంది.