January 12 Vidudala: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాకు జనవరి 12 విడుదల అనే టైటిల్ ఖరారైంది. 2027 జనవరి 12న సినిమా విడుదల కానుంది.
అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు.
25
జనవరి 12 విడుదల
టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది.
35
ట్యాగ్ లైన్ కూడా అదిరింది
ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్ వెనుక ఉన్న అసలు భావం ఏమిటనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకటేష్ టైమింగ్, కల్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలవడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది.
ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ కి చెందిన సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే చిత్ర కథకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. టైటిల్ ప్రకటనతో సినిమా ఏ తరహాలో ఉండబోతుందనే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌కు అనిల్ రావిపూడి మరోసారి తన సినిమాను తీసుకురావడం గమనార్హం.
55
ఒకే దెబ్బకు 2 పిట్టలు
మొత్తంగా చూస్తే జనవరి 12 విడుదల అనే టైటిల్‌తోనే ఈ సినిమా ప్రమోషన్ ఆసక్తికరంగా మొదలైంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా టైటిల్ ఉంది. సినిమా టైటిల్ క్రేజీగా ఉండడంతో పాటు దానిలోనే రిలీజ్ డేట్ కూడా వచ్చేలా పబ్లిసిటీ లభించేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేసిన విధానం అదుర్స్. ఇటీవల అనిల్ రావిపూడి సినిమాలన్నీ సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. అదే తరహాలో టైటిల్స్ కూడా ఉంటున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు.. సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. నెక్స్ట్ సంక్రాంతికి జనవరి 12 విడుదల చిత్రం రాబోతోంది.