నాగ్ అశ్విన్ దగ్గర అశోశియేట్ డైరక్టర్స్ గా చేయాలని ఉందా? ఇలా చేయండి

First Published | Aug 14, 2024, 10:49 AM IST

ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్టు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
 


ప్ర‌భాస్  తో చేసిన  క‌ల్కి 2898AD తో  ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌. థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1100 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. విమర్శకుల నుంచీ ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ ఉంద‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. సైన్స్ ఫిక్షన్ కి, పౌరాణిక పాత్రలను మిళితం చేసిన విధానానికి అన్ని వర్గాల ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఈ నేపధ్యంలో నాగ్ అశ్విన్ తో సినిమా చేయాలని చాలా పెద్ద సంస్ధలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ  క్రమంలో ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ప్రాజెక్టు చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. 

Director Nag Ashwin


నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అశోశియేట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించారు. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్టు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఈ పోస్ట్ లో ఉన్న డిటేల్స్ ప్రకారం మీ ఫ్రొఫైల్ ని వారు ఇచ్చిన ఐడికు పంపితే అక్కడ నుంచి కాల్ వస్తుంది. 


Nag Ashwin


అయితే  ఇక్కడో మెలిక ఉంది.  నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడా కాదా అనేది మాత్రం క్లారిటి ఇవ్వలేదు. నాగ్ అశ్విన్ దర్శకుడిగా చేసే కొత్త సినిమాకేనా? లేకపోతే నిర్మాతగా నాగ్ అశ్విన్ AVM స్టూడియోస్ తో కలిసి సినిమా చేస్తున్నాడా తెలియాల్సి ఉంది. మరో ప్రక్క ఈ పోస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ కల్కి 2 వదిలేసి కొత్త సినిమా చేస్తున్నాడేమో అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై నాగ్ అశ్వినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Nag Ashwin

 దర్శకుడిగా అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ.. నాగ్ అశ్విన్ త‌న మూలాల‌ను మ‌రిచిపోలేదు. త‌న సొంతూరిలోని పాఠ‌శాల‌కు భారీ సాయాన్ని చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఐతోల్‌ గ్రామంలో తరగతి గదుల నిర్మాణానికి 66 లక్షలు విరాళంగా ఇచ్చారు. పునర్నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగ్ అశ్విన్ తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. రానున్న రోజుల్లో గ్రామంలో దేవాలయం నిర్మించి మరిన్ని ధార్మిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని మార్చేందుకు, గ్రామస్తులకు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు.

Nag Ashwin

సినిమాల విష‌యానికి వ‌స్తే.. నాగ్ అశ్విన్ ప్ర‌స్తుతం కల్కి 2898ADకి సీక్వెల్ తెర‌కెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. రెండో భాగం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. పార్ట్ 1లో ఉన్న ఎన్నో ప్రశ్నలకి పార్ట్ 2లో సమాధానాలు దొరుకుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మాత అశ్వినీదత్ కూడా పార్ట్ 2 షూటింగ్ కొంతభాగం అయింది. 2025లో మిగిలిన షూటింగ్ పూర్తిచేస్తాము అని తెలిపారు.

nag ashwin

అయితే ఇలాంటి టైంలో సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కల్కి2 వచ్చే ఏడాది జూన్, జులై కల్లా రిలీజ్ అయిపోతుందంటూ ఈ మధ్య ప్రకటించేశారు నిర్మాత అశ్వనీదత్. అదే టైమ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కల్కి-2 కోసం మరిన్ని ప్రపంచాలు సృష్టించబోతున్నానని సినిమా ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని అప్పుడే చెప్పలేనని క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడిదంతా ఎందుకుంటే అశ్వనీదత్, నాగ్ అశ్విన్ చెప్పిన గడువు కంటే, కల్కి-2 ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

nag ashwin


కానీ కల్కి మూవీలో నటించిన దీపికా పదుకోని గర్బవతి గా ఉన్నారు. సెప్టెంబర్ లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో కల్కి-2 షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలామంది అనుకోవచ్చు. కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చిపడింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనీసం ఏడాదిపాటు గ్యాప్ తీసుకొని తన బిడ్డకు సమయం కేటాయించాలని భావిస్తోందంట దీపిక పదుకోన్. దీని కోసం ఆమె తనకెంతో ఇష్టమైన రోహిత్ శెట్టి ప్రాజెక్టును కూడా కాదనుకుంది. ఇదే క్రమంలో ఆమె ఓ పాపులర్ బాలీవుడ్ షో సీజన్-3కి కూడా నో చెప్పిందంట. ఇవన్నీ చూస్తుంటే ఆమె కల్కి-2 షూటింగ్ కు కూడా దూరమయ్యేలా ఉంది. దాంతో కల్కి 2 లేటు కావచ్చు అంటున్నారు. 

Latest Videos

click me!