ఫస్ట్ టైమ్‌ ప్రియుడి గురించి ఓపెన్‌ అయిన అవికా గోర్‌.. ప్రతి అడుగులో మిలింద్‌ అంటూ ఎమోషనల్‌..

Published : Jun 27, 2022, 09:49 PM IST

`చిన్నారి పెళ్లికూతురు` అవికా గోర్‌ తన ప్రియుడి గురించి ఓపెన్‌ అయ్యింది. మిలింద్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
18
ఫస్ట్ టైమ్‌ ప్రియుడి గురించి ఓపెన్‌ అయిన అవికా గోర్‌.. ప్రతి అడుగులో మిలింద్‌ అంటూ ఎమోషనల్‌..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవికా గోర్‌(Avika Gor) ప్రియుడు మిళింద్‌ చంద్వానీ గురించి మాట్లాడింది. ఫస్ట్ టైమ్‌ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెబుతూ, మిళింద్‌ వచ్చాక తన జీవితంలో చాలా మార్పు వచ్చిందట. తనలో ధైర్యం పెరిగిందని, ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు తెలిపింది. తన బలం ఏంటో తెలుసుకుందట. ఏం చేయగలనో తెలుసుకుందట. తన ఆలోచన పరిధికి మించి తనలో బలం ఉందనే విషయాన్ని మిళింద్‌ తనకు తెలిసేలా చేశాడని ప్రశంసలు కురిపించింది. 
 

28

తన ప్రతి అడుగులోనూ మిళింద్‌(Milind Chadwani) ఉన్నాడని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది. తన ప్రతి ప్రయాణంలో అండగా నిలిచాడని, అతను లేకుండా తాను ఇదంతా చేయలేనని తెలిపింది. తాను బరువు తగ్గడం నుంచి, నిర్మాతగా మారడం వరకు తానేం చేసినా అది మిళింద్‌ ప్రోత్సాహంతోనే అని చెప్పింది అవికా గోర్‌. రెండేళ్ల క్రితం(2020 నవంబర్‌) అవికా తన ప్రియుడు మిళింద్‌ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. 

38

ఇక `చిన్నారి పెళ్లికూతురు` ఫేమ్‌ అవికా గోర్‌ ఇప్పుడు బిజీ అవుతుంది. తెలుగులో ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. నటిగా కొంత గ్యాప్‌ వచ్చిన ఆమెకి ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం శ్రీరామ్‌తో కలిసి `టెన్త్ క్లాస్‌ డైరీస్‌`(!0th Class Diarys)లో నటిస్తుంది. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ  చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూలై 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

48

ఈ సందర్భంగా అవికా గోర్‌ మీడియాతో మాట్లాడుతూ,ప్రియుడి గురించి పై విధంగా స్పందించింది. ఇక తను నటిస్తున్న 'టెన్త్ క్లాస్ డైరీస్' గురించి చెబుతూ, ఇదొక స్వీట్ మూవీ. మీ టెన్త్ క్లాస్ సభ్యులు అందరూ కలిస్తే రీ యూనియన్ అయితే ఎలా ఉంటుందనేది చూపించారు. రీ యూనియన్ ఒక్కటే కాదు. సాంగ్స్, ట్రైలర్‌లో చూపించని ఒక ఎమోషన్ ఉంది. ఇంకా ఇందులో లిటిల్ బిట్ డ్రామా, ఫ్లాష్‌బ్యాక్‌, కామెడీ ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా, చాలా వినోదాత్మకంగా దర్శకుడు అంజి తెరకెక్కించారు. నేను ఎంపిక చేసుకునే కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ కథను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది` అని చెప్పింది.

58

తన టెన్త్ క్లాస్‌ అనుభవాల గురించి చెబుతూ, ఒకవైపు ఎగ్జామ్స్ రాస్తూ మరో వైపు షూటింగ్స్ చేశా. నేను స్కూల్‌కు వెళ్ళింది తక్కువ. లొకేషన్స్‌లో, సెట్స్‌లో ఉన్నది ఎక్కువ అని పేర్కొంది. ఈ చిత్రం తన పాత్ర చుట్టూతే తిరుగుతుందట. అందులో చాలా సస్పెన్స్ ఉందని చెప్పింది. నిర్మాతలు అచ్యుత రామారావు, రవితేజ మన్యం, అజయ్ మైసూర్ షూటింగ్‌ విషయంలో చాలా కంఫర్ట్ గా ఫీలయ్యేలా చేశారని తెలిపింది. రాజీపడకుండా నిర్మించారని చెప్పింది.
 

68

`నటుడు శ్రీరామ్ అమేజింగ్ యాక్టర్. మా మధ్య ఎక్కువ సీన్స్ లేవు. అయితే ఆయనతో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. ఆయన ఎక్స్‌పీరియ‌న్స్‌లు చెప్పారు. దర్శకుడు అంజి గారు చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో బాగా తెలుసు. సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ పరంగా బాగా తీశారు` అని పేర్కొంది. 

78

తెలుగులో గ్యాప్‌ రావడంపై రియాక్ట్ అవుతూ, తాను హిందలో సీరియల్స్ చేస్తుండటం వల్ల తెలుగులో సినిమాలు చేయలేదని, అక్కడే బిజీగా ఉన్నట్టు చెప్పింది. డేట్స్ దొరకగనే తెలుగు సినిమాలు చేయలేదని తెలిపింది. అంతకు మించి మరో కారణం ఏం లేదని వెల్లడించింది. 
 

88

ఈ నెల 30న అవికా పుట్టిన రోజు. దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ, `జూలై 1న 'టెన్త్ క్లాస్ డైరీస్' విడుదలవుతోంది కదా! వీలైతే ఒక్క రోజు ముందు నా పుట్టిన రోజున అది చూడాలనుకుంటున్నా. వచ్చే నెలలో నేను నటించిన 'థాంక్యూ' విడుదల కానుంది. ఇంకా తెలుగులో సినిమా చేస్తున్నాను. పుట్టినరోజున వాటి అప్‌డేట్స్‌ రావచ్చు` అని చెప్పింది. అవికా ఈ చిత్రంతోపాటు `బ్రో`, `పాప్‌కార్న్` వంటి తెలుగు సినిమాల్లో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories