Published : Jul 17, 2024, 06:10 PM ISTUpdated : Jul 17, 2024, 06:12 PM IST
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. చిరంజీవికి బాగా కలసి వచ్చిన హీరోయిన్లు ఉన్నారు. అదే విధంగా కొందరు హీరోయిన్లతో డిజాస్టర్స్ కూడా ఎదురయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. చిరంజీవికి బాగా కలసి వచ్చిన హీరోయిన్లు ఉన్నారు. అదే విధంగా కొందరు హీరోయిన్లతో డిజాస్టర్స్ కూడా ఎదురయ్యాయి. ఇప్పుడంటే హీరోలు హీరోయిన్లకి లేదు. గతంలో అయితే ఒకే హీరోయిన్ తో హీరోలు పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. రాధ, విజయశాంతి లాంటి హీరోయిన్లతో చిరు ఎన్నో చిత్రాలు చేశారు.
26
నిర్మాత అశ్విని దత్ రీసెంట్ గా ప్రభాస్ తో కల్కి 2898 ఎడి లాంటి భారీ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ఏకంగా 1000 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. కల్కి చిత్రానికి ముందు కూడా అశ్విని దత్ టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించింది ఆయనే.
చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ లాంటి చిత్రాలు వచ్చాయి. వీరిలో జై చిరంజీవ మాత్రం డిజాస్టర్. ఈ చిత్ర రిజల్ట్ గురించి అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
46
ఈ చిత్రంలో ఫస్ట్ హీరోయిన్ గా భూమిక ఫిక్స్ అయింది. ఇక సెకండ్ హీరోయిన్ ఎవరనే చర్చ జరిగింది. డైరెక్టర్ విజయ భాస్కర్.. సమీరా రెడ్డిని పెడదాం అని అన్నారు. ఆమె గత చిత్రాలు చూశాను. ఈ చిత్రంలో అన్ని సన్నివేశాలు ఆమె బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగానే ఉన్నాయి అని చెప్పారు. సరే కానివ్వండి అని అశ్విని దత్ అన్నారట.
56
కానీ ఆమె పెద్ద ఐరన్ లెగ్ అంటూ అశ్విని దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వల్ల సినిమాకి ఏమాత్రం హెల్ప్ జరగలేదు. ఆమె సన్నివేశాలు ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. వాస్తవానికి అవన్నీ మంచి సీన్లు. కానీ ఎందుకో అలా జరిగింది. దీనికి తోడు కొన్ని అనర్థాలు కూడా జరిగాయి.
66
మణిశర్మ స్థాయికి తగ్గట్లుగా కూడా జై చిరంజీవా చిత్ర సంగీతం లేకపోవడం ఒక మైనస్ అని అశ్విని దత్ అన్నారు. అనేక కారణాల వల్ల జై చిరంజీవా చిత్రం నిరాశ పరిచింది అని అశ్విని దత్ చెప్పుకొచ్చారు.