నాగి జడ్జిమెంట్ కరెక్ట్. థియేటర్లో ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. ఒకవేళ అశ్వినీ దత్ అనుకున్నట్లుగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేసి ఉంటే చాలా నష్టపోయేవాళ్ళు. ఎందుకంటే జాతి రత్నాలు చిత్రం థియేటర్స్ లో ఏకంగా 70 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కలసి చేసిన కామెడీ హంగామా అంతా ఇంతా కాదు.