విజయ్ దేవరకొండ జాతకం ఎలా ఉందంటే.. మరో ఉదయ్ కిరణ్ అంటూ వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు

Published : Aug 25, 2022, 05:06 PM IST

జయ్ దేవరకొండ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చెబుతూ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టేలా ఉన్నాయి. విజయ్ దేవరకొండకి ప్రస్తుతం అష్టమదశ శని ప్రభావం కొనసాగుతోందని వేణు స్వామి అన్నారు.

PREV
16
విజయ్ దేవరకొండ జాతకం ఎలా ఉందంటే.. మరో ఉదయ్ కిరణ్ అంటూ వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలయింది. రిలీజ్ కి ముందు ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమాలో కంటెంట్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. భారీ హైప్ క్రియేట్ చేసి పూరి జగన్నాధ్ అంచనాలన్నీ తలక్రిందులు చేశాడు అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

26

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ, లైగర్ చిత్రం గురించే చర్చ జరుగుతోంది. లైగర్ ట్రైలర్ లాంచ్ లో పూరి మాట్లాడుతూ ఇండియాలో నెక్స్ట్ బిగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అంటూ ఆకాశానికెత్తేశారు. యువతలో విజయ్ కి  ఆ స్థాయి క్రేజ్ కూడా ఉంది. పైగా లైగర్ పాన్ ఇండియా చిత్రం కావడంతో.. టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా స్టార్ రెడీ అయ్యాడు అంటూ అంచనాలు ఏర్పడ్డాయి. లైగర్ చిత్రం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఆశలకు అడ్డు కట్ట వేసింది అనే చెప్పొచ్చు. 

36

దీనితో విజయ్ దేవరకొండ ఫ్యూచర్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. వివాదాస్పద జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణు స్వామి రంగంలోకి దిగారు. విజయ్ దేవరకొండ జాతకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చెబుతూ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టేలా ఉన్నాయి. 

46

విజయ్ దేవరకొండకి ప్రస్తుతం అష్టమదశ శని ప్రభావం కొనసాగుతోందని వేణు స్వామి అన్నారు. ఈ జాతకం ఉన్న వ్యక్తుల భవిష్యత్తు విభిన్నంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ మరో ఉదయ్ కిరణ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అన్నారు. అందుకే విజయ్ దేవరకొండ జాగ్రత్త పడాల్సిన సమయం అని అన్నారు. 

56

ఈ తరహా జాతకం ఉన్న హీరోల కెరీర్ ఓ వెలుగు వెలిగిన తర్వాత ఒక్కసారిగా డీలా పడుతుందని అన్నారు. విజయ్ దేవరకొండ.. అరవింద్ స్వామి, అబ్బాస్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోల జాబితాలో చేరే అవకాశం ఉందని వేణు స్వామి అన్నారు. అష్టమ దశ శని ప్రభావం కారణంగా విజయ్ దేవరకొండ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

 

66

విజయ్ దేవరకొండ చివరగా నటించిన డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్, ఇప్పుడు లైగర్ చిత్రాలు ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. తన యాటిట్యూడ్, స్టైల్ తో విజయ్ దేవరకొండ యువతని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories