గోవిందరాజు మాత్రం నువ్వు ఈ సాకు పట్టుకొని బాగా కులాసాగా ఉన్నట్టున్నావు కదమ్మా నా చేత కూడా చేయించుకునేలా ఉన్నావే అని అంటాడు. ఆ తర్వాత సీన్లో జానకి, రామా ఇద్దరు బండిమీద కాలేజ్ కి వెళ్తున్నప్పుడు ఒక ఆవిడకి పళ్ళు తల పైన పెట్టడానికి సహాయం చేస్తారు. ఆ తర్వాత సీన్లో మల్లికా హాయిగా తింటూ ఉంటుంది ఇంతట్లో జ్ఞానంబ ఉప్మా చేస్తుంది. ఇదే దొరికిందా అవకాశం అని మళ్లీకా ప్రతిరోజు ఏం కావాలో అన్ని చెప్తుంది .గోవిందరాజు, నీ పని బాగుందమ్మా అని అటకారిస్తాడు. ఇంతట్లో రామా, జ్ఞానాంబ కి ఫోన్ చేసి అమ్మ నాకు పక్క ఊర్లో పనున్నది కనుక ఇంటికి రావడం లేదు సాయంత్రం జానకి గారిని తీసుకుని వస్తాను అని అంటాడు.మరి స్వీట్ కొట్టు అని జ్ఞానం అడగగా ఈ రోజుకు ముసెయ్యడమే అని అంటాడు రామ.