Liger:అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన కామెంట్ విజయ్ దేవరకొండ పైనేనా, అసలేం జరిగింది ?

Published : Aug 25, 2022, 03:37 PM IST

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో లైగర్ చిత్రం నేడు విడుదలయింది. ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

PREV
16
Liger:అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన కామెంట్ విజయ్ దేవరకొండ పైనేనా, అసలేం జరిగింది ?

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో లైగర్ చిత్రం నేడు విడుదలయింది. ఈ చిత్రంపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాధ్ మరోసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు.  హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అంటూ ఒక రేంజ్ లో హైప్ నెలకొంది. 

26

సినిమా విడుదలయ్యాక అంచనాలన్నీ తారుమారయ్యాయి. పూరి జగన్నాధ్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మసిపూసి మారేడు చేసినట్లు ప్రమోషన్స్ తో హైప్ తెచ్చుకున్నారు. కానీ సినిమాలు ఏమీ లేదంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. పూరి జగన్నాధ్ తో పాటు విజయ్ దేవరకొండ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. బోల్డ్ యాటిట్యూడ్ అన్ని సమయాల్లో వర్కౌట్ కాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

36

ఇదిలా ఉండగా తాజాగా స్టార్ యాంకర్, నటి అనసూయ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. అనసూయ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండని ఉద్దేశించే అంటూ నెటిజన్లు డిసైడ్ అవుతున్నారు. ఇంతకీ అనసూయ ఏమందంటే.. 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా ..ఎదుటివారి బాధని చూసి సంతోష పడడం లేదు కానీ ధర్మమే గెలిచింది' అంటూ అనసూయ ట్వీట్ చేసింది. 

46

అనసూయ చేసిన ఈ కామెంట్స్ విజయ్ ని ఉద్దేశించినవిగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అర్జున్ రెడ్డి చిత్రంలో అమ్మని తిట్టినట్లుగా ఉండే ఒక బూతు డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో అందరికి తెలిసిందే. ఆ డైలాగ్ ని అనసూయ కూడా వ్యతిరేకిస్తూ మీడియాకి ఎక్కింది. అమ్మని, అమ్మాయిలని నెగిటివ్ గా ఉపయోగించుకునే కంటెంట్ అవసరమా.. మనం పడే గొడవల్లో ఆడవాళ్ళని లాగడం ఏంటి.. ఇలాంటి వాటికి తానూ వ్యతిరేకం అంటూ అనసూయ అప్పట్లో మీడియా డిబేట్స్ లో తెలిపింది. 

56
Anasuya Bharadwaj

ఎన్ని విమర్శలు ఎదురైనా అప్పట్లో అర్జున్ రెడ్డి చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పుడు అమ్మని ఉద్దేశించి చెడుగా పెట్టిన డైలాగ్.. ఇప్పుడు కర్మ రూపంలో లైగర్ మూవీగా తిరిగి వచ్చింది అని అర్థం వచ్చేలా అనసూయ కామెంట్స్ ఉన్నాయి. 

66

అర్జున్ రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా విజయ్ దేవరకొండ బూతు పదజాలం ఉపయోగిస్తూ రచ్చ చేశాడు. ఈ విషయంపై కూడా అనసూయ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం లైగర్ చిత్రానికి డిజాస్టర్ రెస్పాన్స్ వస్తుండడంతో కర్మ ఇలా వచ్చింది అంటూ అనసూయ ట్వీట్ చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories