ముందే చెప్పిన వేణుస్వామి , విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు

Published : Oct 04, 2025, 07:55 AM IST

ఎట్టకేలకు విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఫిక్స్ అయ్యింది, నిశ్చితార్థం కూడా అయిపోయింది. అయితే ఈ విషయాన్ని ముందే వెల్లడించారు ప్రముఖ సినిమా జ్యోతిషుడు వేణుస్వామి. ఈ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నాడు.

PREV
15
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం

ఎట్టకేలకు విజయ్, రష్మికలు జంట కాబోతున్నారు. చాలా కాలంగా రూమర్ గా ప్రచారంలో ఉన్న వీరి ప్రేమ, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట తమ ప్రేమని ఎప్పుడు బహిరంగంగా ప్రకటించలేదు. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. అప్పుడు కూడా వీరు స్పందించలేదు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా రహస్యంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. శుక్రవారం (03 అక్టోబర్) కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ విషయం తెలిసి ఇటు రౌడీ అభిమానులు, అటు నేషనల్ క్రష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

25
గీతగోవిందంతో మొదలైన బంధం

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ పై ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. గీతగోవిందంతో మొదలైన స్నేహం ప్రేమగా మారి, డియర్ కామ్రేడ్ మూవీ టైమ్ కు ఘాటు లిప్ లాక్ లు ఇచ్చుకునే స్థాయికి వెళ్లింది. ఇక సోషల్ మీడియాలో వీరిద్దరిపై రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. కలిసి ఎప్పుడు కనిపించినా అది హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు జంటగా ఫారెన్ టూర్లు వేసి దొరికిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ముంబయ్ రెస్టారెంట్స్ లో డేట్ కు వెళ్లి, కేమెరా కళ్లకు కూడా వీరు చిక్కారు. విజయ్ ఫ్యామిలీతో రష్మిక కలిసిపోవడం, విజయ్ ఇంట్లోనే మకాం వేయడం లాంటివి వీరి బంధాన్ని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా కానీ.. వీరిద్దరు ఈ విషయంలో స్పందించలేదు. ఖండించలేదు కూడా. చివరకు అందరి అనుమానమే నిజమయ్యింది.

35
ముందే చెప్పిన వేణు స్వామి

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ పెళ్లి గురించి ముందే వెల్లడించారు ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి. సినిమా జ్యోతిషుడిగా ఆయనకు పేరుంది. వేణుస్వామి సినిమా వారిపై చెప్పిన జాతకాలు వైరల్ అవ్వడంతో పాటు వివాదానికి కూడా దారి తీశాయి. ఈక్రమంలో చాలామంది సినిమా వాళ్ల జాతకాలు చెప్పిన ఈ స్వామి, విజయ్ దేవరకొండ, రష్మికల గురించి కూడా పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించాడు. అంతే కాదు సంచలన విషయాలు కూడా ఆయన వెల్లడించారు. ''ఈ విషయం అందరికి తెలిసిందేగా, రష్మిక, విజయ్ ఇద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు, ఆతరువాత విడిపోతారు, కలిసుండే యోగం వారికి లేదు అని సంచలన కామెంట్స్ చేశారు వేణుస్వామి''. అందుకోసం కొన్ని రెమిడీస్ చేయాల్సి ఉంటుందని, వాటి గురించి చెప్పినా వారు పట్టించుకోవడంలేదంటూ ఆయన అన్నారు.

45
రష్మిక తో హోమాలు చేయించిన వేణు స్వామి.

వేణు స్వామి వరుసగా మూవీ స్టార్స్ జాతకాలు చెప్పడంతో బాగా ఫేమస్ అయ్యారు. చాలామంది సెలబ్రిటీలు ఆయన్ను సంప్రదించడం, పూజలు హోమాలు చేయించుకోవడం లాంటివి చేశారు. ప్రముఖంగా నిధి అగర్వాల్, అషురెడ్డి లతో పాటు రష్మిక మందన్న కూడా వేణు స్వామి ఆద్వర్యంలో భారీగా పూజలు, హోమాలు చేయించారు. అందుకు సబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయంలో రష్మిక విమర్శలు కూడా ఫేస్ చేశారు. అయితే ఆ తరువాత కాలంలో మళ్లీ వేణు స్వామివైపు చూడలేదు స్టార్ హీరోయిన్. ఈ విషయంపై కూడా ఆయన ఓ సందర్భంలో స్పందించారు.

55
రష్మికపై వేణు స్వామి విమర్శలు

రష్మిక మందన్న తను చేయించిన పూజలు, హోమాల వల్లే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిందని వేణు స్వామి కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. అయితే తాను స్టార్ అయిన తరువాత రష్మిక వేణు స్వామిని పట్టించుకోలేదని తెలుస్తోంది. స్టార్ అవ్వడానికి ఉపయోగపడ్డ వేణు స్వామి, ఆతరువాత పనికిరాకుండా పోయాడు, విజయ్ దేవరకొండ పక్కన చేరినప్పటి నుంచే రష్మిక తనను పక్కన పెట్టిందని వేణు స్వామి అన్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది స్టార్ కపుల్స్ గురించి, వారి జాతకాలు, జీవితాలు, పెళ్లి, విడాకులు, మరణాల గురించి వెల్లడించిన వేణు స్వామి, రష్మిక, విజయ్ ల గురించి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories