భార్యతో వేణు స్వామి రీల్.. ప్రభాస్ డైలాగ్ ని వాడటంతో నెట్టింట రచ్చ.. ఏమైందంటే?

Published : Mar 31, 2024, 06:23 PM IST

సెలెబ్రెటీ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy)కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. భార్యతో కలిసి ప్రభాస్ డైలాగ్ తో రీల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

PREV
16
భార్యతో వేణు స్వామి రీల్.. ప్రభాస్ డైలాగ్ ని వాడటంతో నెట్టింట రచ్చ.. ఏమైందంటే?

సెలబ్రెటీల జ్యోతిష్యం చెబుతూ వేణు స్వామి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. టీవీలోని పలు ఛానెళ్లలో ఈయన జ్యోతిష్య శాస్త్రంపై ప్రజలకు అవగాహన కలిగిస్తుంటారు.

26

ముఖ్యంగా సినీ ప్రముఖులు, స్టార్ హీరోల జాతకాలపై తరుచూ మాట్లాడుతూ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారుతుంటారు. మరోవైపు హీరోలు, హీరోయిన్ల ఇండ్లలోనూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు.

36

రీసెంట్ టైమ్ లో మాత్రం ఎక్కువగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. దీనితో డార్లింగ్ అభిమానులు, వేణు స్వామికి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే వచ్చింది.

46

ఇలాంటి క్రమంలో వేణు స్వామికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆయన భార్య వీణా శ్రీవాణి భర్త వేణు స్వామితో కలిసి ఓ ఫన్నీ వీడియోను చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

56

‘మిర్చి’ సినిమాలోని ప్రభాస్ - అనుష్క శెట్టి మధ్య సాగే ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వేణుస్వామి కూడా భార్యతో అదే సీన్ ను ఫన్నీగా చేశారు. ఆ వీడియో ప్రభాస్ వాయిస్ ను ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. 

66

వేణు స్వామి ప్రభాస్ పై ఆందోళనకరమైన వ్యాఖ్యలు చేస్తుండగా.. ఆయన భార్య మాత్రం ప్రభాస్ డైలాగ్స్ తో రీల్స్ చేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. ‘మీ ఇంట్లోనే డార్లింగ్ ఫ్యాన్స్’ ఉన్నారంటూ పలువురు అభిమానులు ఆ వీడియోపై స్పందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories