జూ.ఎన్టీఆర్ కి ఆ సమస్యలు తప్పవు, సన్నిహితుల వల్లే.. హెచ్చరించిన జ్యోతిష్యుడు

Published : May 25, 2023, 05:08 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. మే 20న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 40 వ పడిలోకి అడుగుపెట్టడంతో జ్యోతిష్యులు ఈ స్టార్ హీరో జాతకాన్ని తిరగేస్తున్నారు.

PREV
16
జూ.ఎన్టీఆర్ కి ఆ సమస్యలు తప్పవు, సన్నిహితుల వల్లే.. హెచ్చరించిన జ్యోతిష్యుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. మే 20న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 40 వ పడిలోకి అడుగుపెట్టడంతో జ్యోతిష్యులు ఈ స్టార్ హీరో జాతకాన్ని తిరగేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జాతకం ఎలా ఉంటుంది.. జాతక ప్రభావంతో ఎన్టీఆర్ కెరీర్ ఎలా ఉండబోతోంది అనే విషయాలని వివరిస్తున్నారు. 

26

ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. దీనితో ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా మొత్తం వ్యాపించింది. నార్త్ కి చెందిన జ్యోతిష్యులు కూడా ఎన్టీఆర్ జాతకంపై తమ అంచనా చెబుతున్నారు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ జగన్నాథ్ గురూజీ ఎన్టీఆర్ జాతకాన్ని వివరించారు. 

36

ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ నమ్మదగిన వారుగా ఉంటారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ సినిమాల పరంగా మరింత ఖ్యాతిని పొందుతారు. కెరీర్ గ్రోత్ పెరుగుతుంది. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అయితే కొన్ని నిర్ణయాలు ఎన్టీఆర్ లైఫ్ లో ఇబ్బందులు గురి చేస్తాయి అని జగన్నాథ్ అన్నారు. 

46

జూ. ఎన్టీఆర్ కి అతడి సన్నిహితుల వల్లే సమస్యలు ఎదురవుతాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. ఎన్టీఆర్ జాతకంలో గురు ప్రభావం కూడా ఉంది. దాని వల్ల డబ్బు, కెరీర్ లో బ్యాలెన్స్ ఉంటుంది. కొంత కుజ ప్రభావం కూడా ఉందని జ్యోతిష్యులు తెలిపారు. 

56

జ్యోతిష్యులు సన్నిహితుల నుంచి సమస్యలు అని చెప్పడంతో నెటిజన్లు దీనిని బాగా వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలిలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఇప్పటికే తారక్ అభిమానులు నిరాశపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన తాతగారి శతజయంతి వేడుకలకు కూడా తారక్ హాజరు కాలేదు. 

66

ఈ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేశారు. దీనితో ఎన్టీఆర్, బాలయ్య మధ్య ఏం జరిగుతోంది అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ మూవీ, హృతిక్ రోషన్ తో మల్టీస్టారర్ వరుసగా లైనప్ లో ఉన్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories