ఫస్ట్ వీక్‌ పక్కాగా ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్‌ ఎవరంటే ? : ఏషియానెట్‌ తెలుగు ఎక్స్ క్లూజివ్‌

First Published | Sep 6, 2024, 5:28 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 వ సీజన్‌లో మొదటి వారానికి సంబంధించి ఎలిమినేషన్‌ ప్రక్రియ హాట్ హాట్ గా మారింది. ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది తేలిపోయింది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభమై వారాంతానికి వచ్చింది. అప్పుడే ఐదు రోజులు గడిచిపోయాయి. రేపు(శనివారం) హోస్ట్ నాగార్జున రానున్నారు. మొదటి వారం ఎలా సాగింది? ఎవరెవరు ఏమేం మిస్టేక్‌ చేశారనేది ఆయన చెప్పనున్నారు. క్లాస్‌లు పీకడాలు, వార్నింగ్‌ ఇవ్వడాలు ఉంటాయి.

అదే సమయంలో బాగా ఆట ఆడిన వాళ్లని అభినందించడం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీకెండ్‌ అనేది అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొని ఉంటుంది. అన్నింటికి మించి ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ ఆడియెన్స్ కి మరింత ఎగ్జైటింగ్‌ పాయింట్‌.  
 

14 మందితో బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి వారంలో ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌లో బేబక్క, శేఖర్‌ బాషా, మణికంఠ, పృథ్వీరాజ్‌, సోనియా ఆకుల, ప్రేరణ,  విష్ణుప్రియ ఇలా ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరికి సంబంధించి వేయాల్సిన ఓటింగ్ టైమ్‌ ఈ రాత్రితో ముగుస్తుంది.

రేపు సాయంత్రానికి ఓటింగ్‌ని బట్టి ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఏషియా నెట్‌ తెలుగు పోల్‌ బిగ్‌ బాస్‌ పోల్స్ః ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు? నిర్వహించింది. ఈ వారం ఎవరు హౌజ్‌ నుంచి ఎగ్జిట్‌ అయ్యే అవకాశం ఉందనేది పోల్‌ నిర్వహించింది. ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది స్పందించారు. ఈ పది వేల ఓట్లని బట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారనేది ఓ క్లారిటీ వచ్చింది. 
 


మరి ఇంతకి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారు? అనేది చూస్తే, మెజారిటీగా బేబక్క పేరుని క్లిక్‌ చేశారు. బేబక్క, శేఖర్‌ బాషా, మణికంఠ, పృథ్వీరాజ్‌లను పోల్‌లో పెట్టగా, 38 శాతం ఆడియెన్స్ బేబక్క పేరుని సూచించారు. ఈ వారం బేబక్కనే ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని ఏషియానెట్‌ తెలుగు పోల్‌లో బిగ్‌ బాస్‌ పోల్స్ః ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు? పాల్గొన్న ఆడియెన్స్ తమ అభిప్రాయంగా వెల్లడించారు.

ఆ తర్వాత మణికంఠ పేరుని క్లిక్‌ చేశారు. ఆయనకు 34 శాతం ఓట్లు పడ్డాయి. హౌజ్‌లో విచిత్రమైన ప్రవర్తనతో, ఎప్పుడూ ఏడుస్తూ, సింపతి గేమ్‌ ఆడుతున్నారనే కామెంట్లని ఎదుర్కొంటున్న మణికంఠ ఈ పోల్‌లో బాటమ్‌ నుంచి రెండో స్థానంలో ఉన్నారు. బేబక్క, మణికంఠకి మధ్య కేవలం నాలుగు శాతం ఓట్ల డిఫరెంట్స్ ఉంది. 
 

RJ Sekhar Basha

ఇక పృథ్వీరాజ్‌, శేఖర్‌ బాషా సేఫ్‌ జోన్‌లోనే ఉండబోతున్నారనేది అర్థమవుతుంది. వాళ్లు బయటకు వెళ్లే ఛాన్స్ కేవలం 13,  14 శాతం మాత్రమే ఉందని ఏషియానెట్‌ తెలుగు బిగ్‌ బాస్‌ పోల్స్ః ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు? ఆడియెన్స్ వెల్లడించడం విశేషం. మొత్తంగా బేబక్క మొదటి వారం హౌజ్‌ని వీడబోతుందని తెలుస్తుంది. బిగ్‌ బాస్‌ పోలింగ్‌లోనూ అలాంటి ఓటింగ్స్ పడిందా? లేదా అనేది రేపు సాయంత్రానికి క్లారిటీ రానుంది.

శేఖర్‌ బాషా కూడా వీక్‌గానే ఉన్నాడు. ఆయన విషయంలోనూ డౌటే ఉందని నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. అయితే మొదటి వారం ఎలిమినేషన్‌ ఉండబోతుందని తెలుస్తుంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. (గమనికః ఏషియానెట్‌ తెలుగు ఎక్స్ క్లూజివ్‌గా బిగ్‌ బాస్‌ పోల్స్ః ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు? నిర్వహించిన పోల్‌లో దాదాపు పదివేల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు)

Happy Birthday Pawan Kalyan

ఈ సందర్బంగా ఓ సారి బెజవాడ బేబక్క బ్యాక్‌ గ్రౌండ్‌ గురించి తెలుసుకుంటే.. బిగ్‌ బాస్‌ తెలుగు 8 షోలోకి ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది బేబక్క. ఆమె అసలు పేరు మధు నెక్కంటి. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌. యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలు చేస్తూ ఫేమస్‌ అయ్యింది. ఆమె లాంగ్వేజ్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదే ఆమెని పాపులర్‌ చేసింది. కరోనా టైంలో తన రీల్స్‌తో బాగా వైరల్‌ అయ్యింది. అందరికంటే డిఫరెంట్ గా రీల్స్ చేయడం ఆమె స్పెషల్. సోషల్ మీడియాలో బేబక్కకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెకు భారీగా ఫ్యాన్ బేస్  ఉంది. ముఖ్యంగా  ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. వీడియోస్, రీల్స్, సినిమాలు.. ఇలా రకరకాలుగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది బేబక్క.

ఫన్నీ కంటెంట్ తో నెటిజన్లను నవ్విస్తూ సందడి చేస్తుంటుంది. అదే సమయంలో మల్టీ టాలెంటెడ్ గా నిరూపించుకుంది. విజయవాడలో ఉంటూ బెజవాడ పేరుతో ఫేమస్ అయిన బేబక్క లో కామెడీయన్ మాత్రమే కాదు మంచి సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా ఉన్నారు. అందరు మాట్లాడుకుంటే మాటల్లోనే ఫన్నీ కామెంట్స్ తో అదరగొడుతుంది బేబక్క. 
 

బేబక్కకి అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అమెరికాలో ఉంటూ రీసెంట్ గా ఇండియాలో అడుగు పెట్టింది. ఇండియాలో సెటిలో సెటిల్ అయ్యారు. ఇక్కడే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయారు. ముంచు లక్ష్మీతో చేసిన కొన్ని రీల్స్ బాగా వర్కౌట్‌ అయ్యాయి. బెజవాడ బేబక్క తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా నటించారు.

హీరో శ్రీకాంత్‌ సరసన `అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి` అనే సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. `24 కిసెస్‌`, `మళ్లీ పెళ్లి` వంటి దాదాపు 20 సినిమాల వరకు చేశారు. అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనకు బంధువని కూడా ఆమె  ఓ ఇంటర్య్వూలో తెలిపింది. సో అలా బేబక్కకి సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పొచ్చు. 
 

ఇక బిగ్‌ బాస్‌ ఓపెనింగ్‌ రోజు స్టేజ్‌పైకి నాగార్జున పిలిస్తే.. రాకుండా లవ్‌ హార్ట్ సింబల్స్ పంపిస్తూ కాసేపు ఊరించింది. ఎట్టకేలకు స్టేజ్ పైకి వచ్చి నాగ్‌ కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోయింది. నాగ్‌పై ప్రేమని ఒలకబోసింది. ఎట్టకేలకు శేఖర్‌ బాషాతో జోడీగా హౌజ్‌లోకి వెళ్లింది. బయట యూట్యూబ్‌ వీడియోలలో రచ్చ చేసిన బేబక్క హౌజ్‌లోకి వెళ్లాక అది తప్ప మిగిలిన అన్ని పనులు చేస్తుంది.

ఏమాత్రం ఎంటర్‌టైన్‌ చేయలేకపోయింది. టాస్క్ ల్లోనూ యాక్టివ్‌గా పాల్గొనలేదు. ఇతర కంటెస్టెంట్లతో వాదించే విషయంలోనూ డల్‌గానే ఉంది. అయితే ఆమె ఎక్కువగా శేఖర్‌ బాషాతోనే కనిపించింది. ఈ ఇద్దరు పులిహోర కలుపుకుంటున్నట్టు అనిపించింది. బాత్‌ రూమ్‌ ఏరియాలో శేఖర్‌ బాషా, బేబక్క మధ్య సరదా డిష్కషన్‌ నడుస్తుండగా, మాటల్లో మాటగా బేబక్కకు  ఐ లవ్ యూ చెప్పాడు.

దీంతో బేబక్క షాక్‌ అయ్యింది. ఇది సోషల్‌ మీడియాలో రచ్చ అవుతుందని చెప్పి టీ ఇచ్చాడు. మొత్తంగా బేబక్క బిగ్‌ బాస్‌ ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. అందుకే ఎలిమినేట్‌ కాబోతుందని ఏషియానెట్‌ తెలుగు పోల్‌ని బిగ్‌ బాస్‌ పోల్స్ః ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు? బట్టి తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.  మీరు బిగ్ బాస్ తెలుగు 8 అన్ అపిషీయల్ ఓట్ ను (బిగ్‌ బాస్‌ పోల్స్ః ఈ వారం బిగ్ బాస్ హౌౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యేది ఎవరు?) లింక్ క్లిక్ చేసి వేయొచ్చు. ఎవరు లీడింగ్ లో ఉన్నారో లేదో చూడొచ్చు. 

Latest Videos

click me!