మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం జానపద చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చూడాలని ఉంది చిత్రం కూడా సూపెర్ హిట్ గా నిలిచింది. ఏఈ రెండు చిత్రాలు నెమ్మదిగా మొదలై ఒక సంచలనం సృష్టించాయని అశ్విని దత్ అన్నారు.