పొగిడిన వాళ్లే మోహం పట్టుకుని తిట్టారు.. అప్పుల బాధతో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా జబర్దస్త్ కమెడియన్‌..

First Published | May 12, 2024, 12:51 PM IST

జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పి షాకిచ్చాడు. అసలు ఏం జరిగిందనేది చూస్తే..
 

జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ఎంతో మంది స్టార్‌ కమెడియన్లు అయిపోయారు. హీరోలుగా రాణిస్తున్నారు. దర్శకులుగానూ మారారు. హైపర్ ఆది రాజకీయాల్లోనూ బిజీ అవుతున్నాడు. ఇలా వందల, వేల మందికి ఉపాధితోపాటు లైఫ్‌ ఇస్తుంది జబర్దస్త్. అలా ముక్కు అవినాష్‌ కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్‌ అయ్యాడు. ఎంతో ప్రయత్నాలు చేసినా ఏదీ వర్కౌట్‌ కాలేదు. చివరికి ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు.  
 

జబర్దస్త్ అవినాష్‌ జీవితంలో చాలా కష్టాలున్నాయి. పస్తులున్న రోజులున్నాయి. కిరాణషాపులో పనిచేయడం, ఆఫీస్‌ బాయ్‌గా చేసి వచ్చిన రోజులున్నాయి. అదే సమయంలో అప్పుల బాధ ఎక్కువై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. తాజాగా జబర్దస్త్ కమెడియన్‌ అవినాష్‌ ఆ విషయాలను బయటపెట్టాడు. అంజి టాక్స్ తో సూసైడ్‌ చేసుకోవాలనుకునే పరిస్థితికి దారి తీసిన అంశాలను బయటపెట్టాడు. 
 


అవినాష్‌.. ఇంటర్‌ అయిపోయాక హైదరాబాద్‌ వచ్చాడు. బిటెక్‌ చేసే సమయంలో ఇంట్లో నుంచి పంపించే డబ్బులు సరిపోయేవి కావట. మూడు వేలు పంపిస్తు, రూమ్‌రెంట్ కే అయ్యేదట. దీంతో తన ఖర్చులకు కోసం ఆయన కొన్ని రోజులు కిరాణ షాపులో పనిచేశాడు. అంతేకాదు ఓ ఆఫీసులో ఆఫీస్‌ బాయ్‌గానూ చేశాడట. అలాగే ఐస్‌ క్రీమ్‌ బండి కూడా నడిపించినట్టు తెలిపాడు. 
 

అంతకు ముందే తనకు మిమిక్రీ అంటే ఇష్టం. తండ్రితోపాటు ముంబయి వెళ్లాడట. అక్కడ క్లిక్‌ కాలేదు. దీంతో హైదరాబాద్‌ వచ్చి స్టడీస్‌పై ఫోకస్‌ చేశాడు. కానీ సినిమాల పిచ్చిపోలేదు. బిటెక్‌ చదివే సమయంలోనే అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగారట. చివరికి ఓ ఛాన్స్ వస్తే ఎడిటింగ్‌లో పోయిందట. మరోసారి ఓ టీవీ షోలో ఛాన్స్ వస్తే అది కూడా ఎడిటింగ్‌లో లేచిపోయిందట. 
 

కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా షూటింగ్‌లో పనులు చేసేవాడట. ఈ క్రమంలో అదిరే అభి పరిచయం అయ్యాడని, ఆయన తనని జబర్దస్త్ లోకి తీసుకొచ్చినట్టు తెలిపాడు. కంటెస్టెంట్‌గా ఉన్న తాను, మంచి కామెడీతో టీమ్‌ లీడర్‌ అయినట్టు తెలిపారు. కార్తీక్‌ తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, కలిసి షోస్‌ చేసినట్టు తెలిపారు. జబర్దస్త్ లో మనీ వస్తుండటంతో నమ్మకం వచ్చిందట. అది కూడా టీమ్‌ లీడర్‌ అయ్యాక తనపై తనకు కాన్పిడెన్స్ వచ్చిందన్నారు. 
 

 అయితే జబర్దస్త్ లో ఫామ్‌లో ఉన్న సమయంలోనే తాను ఇళ్లు కట్టుకున్నాడట. సేవ్‌ చేసిన డబ్బులన్నీ అయిపోయాయి. జీరో బ్యాలెన్స్ కి వచ్చింది. అప్పుడే కరోనా వచ్చింది. లాక్‌ డౌన్‌ పడింది. నెల నెల అప్పులకు వడ్డీలు కట్టాలి. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడిపెరిగింది. ఇంటి కోసం కొంత అప్పుడు చేయాల్సి వచ్చిందని, దీంతో కొంత మంది డబ్బులు తెచ్చినట్టు తెలిపారు అవినాష్‌. అయితే తన కామెడీ నచ్చి వాళ్లు ఎంతో పొగిడే వాళ్లు అట, మీ కామెడీ బాగుంటుంది, మీరు అడిగితే ఇవ్వమా అని ఆ సమయంలో డబ్బులు ఇచ్చారట. 

కానీ కరోనా సమయంలో పని లేకపోవడంతో వడ్డీలు కట్టలేకపోయాడట. దీంతో కామెడీ బాగుందని పొగిడినవాళ్లే ఆ తర్వాత తిట్టడం స్టార్ట్ చేశారు. మొహం మీదే తిట్టినవాళ్లు చాలా ఉన్నారు. దీంతో ఒత్తిడిపెరిగిపోయిందని, ఏంచేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్నారు అవినాష్‌. తన జీవితంలో ఆకలి బాధలు ఉన్నాయి, కానీ అప్పుల బాధలు లేవు, ఫస్ట్ టైమ్‌ వాటిని ఫేస్‌ చేయాల్సి రావడంతో తట్టుకోలేకపోయినట్టు తెలిపారు. 
 

బావి వద్దకు వెళ్లి నీటిలో దూకాలనిపించిందట. ఆ సమయంలో ఆలోచించే క్రమంలో ఫ్రెండ్‌ గెటప్ శ్రీను గుర్తొచ్చాడు. ఆయనకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడట. ఆ సమయంలో గెటప్‌ శ్రీను `ఇస్మార్ట్ శంకర్‌` షూటింగ్‌లో ఉన్నాడు. దీంతో ఫోన్‌ తీసుకెళ్లి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కి ఇచ్చాడు. ఆయన ఓ ఐదు నిమిషాలు హితభోద చేశాడు. పూరీ మాటలతో తనలో ఎనర్జీ వచ్చింది. లైఫ్‌ సినిమాలాంటిది అని, అందులో కొన్ని సీన్లు పండుతాయి, కొన్ని పండవు, ఇప్పుడు నీ లైఫ్‌లో ఈ సీన్‌ పండలేదు, నెక్ట్స్ వర్కౌట్‌ అవుతుంది. సక్సెస్‌ వస్తుందని చెప్పాడట. ఈ చిన్నదానికి నువ్వే ఇలా అయితే నా పరిస్థితేంది, నేను ఏం చేసుకోవాలని చెప్పాడట పూరీ. 
 

నా మైండ్‌ సెట్‌ మొత్తం మారిపోయిందన్నారు అవినాష్‌. చాలా ఎనర్జీగా, రిలీఫ్‌గా అనిపించిందని తెలిపాడు. ఈ ఘటన నుంచి జరిగిన మూడు నాలుగు రోజులకే బిగ్‌ బాస్‌ నుంచి ఫోన్‌ వచ్చిందట. ఆ తర్వాత జబర్దస్త్ ఫ్రెండ్స్, శ్రీముఖి తనకు హెల్ప్ చేశారని చెప్పాడు. శ్రీముఖి అడగ్గానే ఐదు లక్షలు తీసుకొచ్చి ఇచ్చిందని తెలిపాడు. శ్రీముఖి తనకు బెస్ట్ ఫ్రెండ్‌ అని, `పటాస్‌` ప్రోగ్రామ్‌ నుంచి ఆ స్నేహం కొనసాగుతుందన్నారు అవినాష్‌. ఇప్పుడు అప్పులు అన్ని సెట్‌ అయ్యాయి, హ్యాపీగా ఉన్నట్టు తెలిపారు అవినాష్‌. ప్రస్తుతం `స్టార్ మా పరివార్‌`, `నీతోనే డాన్స్` వంటి షోస్‌ చేస్తున్నట్టు తెలిపారు. బిగ్‌ బాస్‌ షోలో తనదైన కామెడీతో నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. బిగ్‌ బాస్‌ ఆయనకు మంచి ఇమేజ్‌, క్రేజ్‌ని తీసుకొచ్చింది. 
 

Latest Videos

click me!