వైయస్ జగన్ కు 'ఈటీవి' ఫైనల్ పంచ్? ...పోలింగ్ కు కొద్ది గంటల్లో ...ఇంపాక్ట్ ఉంటుందా

Published : May 12, 2024, 02:27 PM IST

 తెలుగుదేశం  పార్టికు పూర్తి మద్దతు అయిన ఈనాడు,ఈటీవి ఆఖరి అస్త్రంగా   సినిమాని బయిటకు తీసి ప్రసారం చేసింది.

PREV
113
 వైయస్ జగన్ కు 'ఈటీవి' ఫైనల్ పంచ్? ...పోలింగ్ కు కొద్ది గంటల్లో ...ఇంపాక్ట్ ఉంటుందా
jagan ys

ఏపీలో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది గంటలే సమయం ఉంది. నిన్నటితో  ప్రచారం ముగిసింది. ఈ కొద్ది రోజులు ఎవరి స్థాయిలో వాళ్లు ప్రచారాస్త్రాలను పదునెక్కించి దుమ్ము దులిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని గద్దె దించాలని  తెలుగుదేశ, జనసేన, బిజీపి కూటమి దూకుడుగా ప్రచారం చేసారు.  ప్రచారం చివరి రోజు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాక్షి మినహా అన్ని ప్రధాన పత్రికల్లో ఫస్ట్ పేజ్ యాడ్‌తో జనాలకు వైసీపీని ఓడించాలనే పిలుపునిచ్చింది టీడీపీ. అంతేకాదు తెలుగుదేశం  పార్టికు పూర్తి మద్దతు అయిన ఈనాడు,ఈటీవి ఆఖరి అస్త్రంగా రాజధాని ఫైల్స్ సినిమాని బయిటకు తీసింది. 

213


అమరావతి రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా శ్రీమతి హిమబిందు సమర్పణలో, భాను దర్శకత్వంలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ కంఠంనేని నిర్మించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రం.  ఈనెల 12 అంటే ఈ రోజు ఆదివారం నాడు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం అయ్యింది. ఒక దుర్మార్గుడు పాలకుడై రైతుల జీవితాలతో ఆడుకుంటుంటే, ఆ దుర్మార్గుడిపై తిరగబడి, రైతులు సాధించిన విజయం ఈ చిత్రం కథ నడుస్తుంది. 

313
jagan mohan reddy


మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తాను చేసే ప్రచారంలో సమయభావం వల్ల ప్రతీ ఊరికి, ప్రతీ ఇంటికి నేరుగా వెళ్లలేకపోయారు! అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బి.జె.పి. నాయకులు కూడా కొన్ని ప్రాంతాలకి వెళ్లలేకపోయారు..ఐనా తమ శక్తివంచన లేకుండా ప్రచారం చేశారు. వీళ్ల కూటమిని గెలిపించండని ప్రజలందరికీ చెప్పడానికి తెలుగువన్ వారి "రాజధాని ఫైల్స్" చిత్రం మాత్రం ప్రతీ ఇంటింటికీ వెళ్లి తలుపు తడుతోంది, ఇంటిలో ఉన్న ప్రతీ ఒక్కర్నీ ఆలోచింప చేయబోతోంది అంటూ ఈ సినిమా చేస్తున్న పనిని పబ్లిసిటీగా చెప్పారు. 

413
Pawan Kalyan


రాజధాని లేని లోటుని.. కూటమి గెలుపు అవసరాన్ని ప్రజలకి తెలియజెప్పిన సినిమాగా దీన్ని చెప్తున్నారు.  అందుకే రేపు పోలింగ్ అనగా 12వ తేది ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో మీ ముందుకు తీసుకు వచ్చారు. "రాజధాని ఫైల్స్" చిత్రంతో  కూటమి గెలుపుకి శ్రీకారం చుడుతున్నామని, రాష్ట్ర భవితకు ఆకారం ఇవ్వబోతోందని చెప్తున్నారు. 

513


తెలుగు వన్‌ ప్రొడక్షన్‌ (Telugu One Production)లో రూపొందిన చిత్రం రాజధాని ఫైల్స్‌ .  అరుణప్రదేశ్‌లో కేఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజధానిని ఎలా విధ్వంసం చేసిందో, అయిరావతికి భూములు ఇచ్చిన రైతులపై ఎలాంటి కర్కశ వైఖరిని ప్రదర్శించిందో రాజధాని ఫైల్స్‌ లో  చూపించారు. కేఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కత్తి. నాలుగు ప్రాంతాలు, నాలుగు రాజధానులే తమ ఎజెండా అంటూ అయిరావతి విధ్వంసానికి పూనుకోవడంతో సినిమా ప్రారంభం అవుతుంది. పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధానీ అంతే అవసరం అంటూ  వివరిస్తారు. 

613
YS Jagan Mohan Reddy, chandrababu


ఇక ఈ సినిమాలో ..రాష్ట్ర భ‌విష్య‌త్తు, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం మూడు పంట‌లు పండే త‌మ పంట పొలాల్ని నిస్వార్థంగా ఇస్తే ఆ రైతుల‌కు క‌న్నీళ్లే ఎదుర‌య్యాయనే విషయం చెప్తుంది. ఊళ్లు బాగుప‌డ‌తాయ‌ని భావి త‌రాల భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని క‌ళ్ల ముందు అమ‌రావ‌తి క‌లల సౌధాలు సాకారమ‌వుతుంటే చూడాల‌నుకున్న ఆ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆవిర‌య్యాయి. బిడ్డ‌ని పొదిగే గ‌ర్భంలో గొడ్డ‌లి దించిన క‌ర్క‌శ‌త్వంలా ఒక్క‌రి అహం కోట్ల మంది క‌ల‌ల్ని అలాగే కొన్ని వేల మంది రైతుల జీవితాల్ని నాశనం చేసిందని చూపెట్టారు. దీంతో తమకు న్యాయం జరగాలంటూ అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మబాట ప‌ట్టారు. న్యాయ‌స్థానాలు మొద‌లుకొని దేవ‌స్థానాల వ‌ర‌కూ వెళ్లి వాళ్ల ఆవేదనను వెళ్లగక్కటం ఉంటుంది.  

713
YS Jagan Mohan Reddy, YS Jagan,


క‌థేంటంటే ? :
అరుణ‌ ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌త్తి గుర్తు కె.ఆర్‌.ఎస్ పార్టీ ఎలక్షన్స్​లో గెలిచాక నిర్మాణ ద‌శ‌లో ఉన్న అయిరావ‌తిపై క‌త్తి క‌డుతుంది. ఎవ‌రో క‌న్న‌బిడ్డ‌కి మీరు తండ్రిగా ఉండ‌ట‌మేంటంటూ త‌న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త చెప్పిన మాటలు విన్న ఆ ముఖ్య‌మంత్రి అధికార వికేంద్రీక‌ర‌ణ పేరుతో నాలుగు రాజ‌ధానులను స్థాపించేందుకు సిద్ధపడతాడు. అపోజిషన్​లో ఉన్నప్పుడు అయిరావ‌తి నిర్ణయాన్ని స‌మ్మతించిన అదే వ్య‌క్తి, అధికారంలోకి రాగానే మాట మార్చ‌డం వల్ల తమ రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళ‌న బాట ప‌డతారు.

813

అయితే త‌న అధికార బ‌లంతో ఆ ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న ఆందోళ‌న‌ల‌పై ఉక్కుపాదాన్ని మోపుతాడు. అంతే కాకుండా ఆ ముఖ్య‌మంత్రికి మ‌రో ఇద్ద‌రు ఎంపీలు తోడవ్వడం వల్ల రైతుల వారంతా చేరుకుని ప్రజల మానప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌తారు. దీంతో పోరాటానికి దిగిన ఎంతోమంది ఉద్య‌మకారాలు ప్రాణాలు కోల్పోతారు. అయినా ధైర్యం కోల్పోని రైతులు తమ నిరసనను కొన‌సాగిస్తారు. 
 

913


అయినప్పటికీ ముఖ్య‌మంత్రి దిగిరాక‌పోవ‌డం వల్ల అరుణ‌ప్ర‌దేశ్‌లోని తెలుగు ప్ర‌జ‌లు ఏం చేశారు? ఆ ముఖ్య‌మంత్రికి బుద్ధి చెప్పేందుకు ఆ తర్వాతి ఎన్నిక‌ల్లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు? రైతుల‌కు ప్ర‌తినిధులుగా ఉన్న ఓ కుటుంబం (వినోద్‌కుమార్‌, వాణీ విశ్వ‌నాథ్‌, అఖిల‌న్‌) ఈ ఉద్య‌మంలో ఎలాంటి పాత్ర పోషించింది? ఇటువంటి విష‌యాలు తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే.

1013

ఇక  సీఎం జగన్‌, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని.. గతేడాది డిసెంబర్‌ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి  హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.   విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.  విచారణ చేపట్టి చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది. సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది.

1113

మాట‌లు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఒడిలో పిల్ల‌ల్ని జో కొట్టే మ‌హిళ‌... ఉద్య‌మంలోకి వ‌చ్చి జై కొట్టిందంటే ప్ర‌ళ‌య‌మే, మ‌న పంట‌కి నీరు ఎంత అవ‌స‌ర‌మో రాష్ట్రానికి రాజ‌ధాని అంతే అవ‌స‌రం,  దేశానికే అన్నం పెట్టిన అన్న‌పూర్ణ అరుణ‌ప్ర‌దేశ్ భ‌వ‌తీ భిక్షాందేహి అంటూ క‌నిపించిన అంద‌రినీ అప్పులు అడుక్కునే స్థాయికి దిగ‌జారిపోయింది.. త‌దిత‌ర సంభాష‌ణ‌లు సినిమాకు బ‌లాన్నిచ్చాయి.

1213

ద‌ర్శ‌కుడు భాను వాస్త‌వ సంఘ‌ట‌న‌ల్ని డాక్యుమెంట‌రీలా కాకుండా..  వాణిజ్యాంశాల్ని జోడించి తెర‌పైకి తీసుకొచ్చిన తీరు ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉంది. రైతు ప్ర‌తినిధులుగా, దంప‌తులుగా వినోద్‌కుమార్‌, వాణీ విశ్వ‌నాథ్ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. వారి త‌న‌యుడుగా అఖిలన్ న‌టించాడు. ఏఐ టెక్నాల‌జీలో ఉన్న‌త చ‌దువులు చ‌దివిన ఇంజినీర్‌గా అత‌ని పాత్ర, న‌ట‌న ద్వితీయార్థానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. రాజ‌ధాని కోసం భూములిచ్చిన ప‌లువురు రైతులు ఇందులో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ముఖ్య‌మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా క‌నిపించిన న‌టులు నిజ జీవిత వ్య‌క్తుల్ని గుర్తు చేస్తూ ఆ పాత్ర‌ల్లో మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు.

1313

 రాజ‌ధాని ప‌రిధి వెల‌గ‌గూడెంలోని ప‌చ్చ‌ని పంట పొలాలు, వాటితో రైతుల‌కు త‌ర‌త‌రాలుగా ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ క‌థను మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. రాష్ట్ర అభివృద్ధి, త‌మ ప్రాంత భ‌విష్య‌త్తుని దృష్టిలో ఉంచుకుని రైతులు రాజ‌ధాని కోసం స్వ‌చ్ఛందంగా భూములు ఇవ్వ‌డం,  రాజ‌ధాని నిర్మాణం కోసం ప‌విత్ర జలాల‌తో భూమి పూజ చేయ‌డం నుంచి కథ ఊపందుకుంటుంది. (Rajadhani Files Review) ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో కొత్త ప్ర‌భుత్వం వచ్చాక ప‌రిణామాలు మారిపోతాయి.ఇవే హైలెట్ చేసారు. అయితే సరైన సమయం చూసి సినిమాని ఈటీవిలో వేయటం ఓ వర్గాన్ని ఆనందపరిచింది. సోషల్ మీడియాలో వారు పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ఏ మేరకు ఈ సినిమా ప్రభావం చూపిస్తుందో చూడాలి. 

click me!

Recommended Stories