Ashu Reddy: లవర్స్ డే వేళ అషురెడ్డి సంచలనం... ఆ కమెడియన్ తో కలిసి!

Published : Feb 15, 2023, 12:03 PM IST

అషురెడ్డి లవర్స్ డే వేళ బుల్లితెర కమెడియన్ తో కనిపించారు. ఇద్దరూ ఒక అనాధ ఆశ్రమంలో వాలెంటైన్స్ వేడుకలు నిర్వహించారు.   

PREV
16
Ashu Reddy: లవర్స్ డే వేళ అషురెడ్డి సంచలనం... ఆ కమెడియన్ తో కలిసి!
Ashu Reddy

అషురెడ్డికి బోల్డ్ ఇమేజ్ ఉంది. ఆమెపై పలు ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి చాలా సన్నిహితంగా ఉంటారు. తరచుగా విందులు విహారాలు చేస్తుంటారు. ఈ క్రమంలో రాహుల్-అషురెడ్డి ప్రేమించుకుంటున్నారనే వాదన ఉంది. ఇటీవల రాహుల్ పాడిన నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా రాహుల్ కి అషురెడ్డి కంగ్రాట్స్ చెప్పారు. గట్టిగా హగ్ చేసుకొని మరీ అభినందించారు. వారిద్దరి ఫోజు లవర్స్ ని తలపించింది. 
 

26
Ashureddy

అలాగే కమెడియన్ హరితో కూడా అషురెడ్డి సన్నిహితంగా ఉంటారు . కామెడీ స్టార్స్ ఫేమ్ ఎక్స్ ప్రెస్ హరి-అషురెడ్డి ఆ మధ్య బుల్లితెర మీద రచ్చ చేశారు. కామెడీ స్కిట్స్ చేస్తూ, రొమాంటిక్ డ్యూయట్స్ పాడుకున్నారు. హరి తన గుండెలపై అషురెడ్డి పేరును టాటూ వేయించుకున్నాడు. అది అందరి ముందు చూపించాడు. కోప్పడిన అషురెడ్డి హరిని చెంపపై కొట్టింది. అషురెడ్డి పట్ల పరిమితమైన ప్రేమను చూపిస్తాడు.

36
Ashu Reddy

కాగా వీరిద్దరూ కలిసి వాలెంటైన్స్ వేడుకలు  జరుపుకోవడం ప్రాధ్యానత సంతరించుకుంది. ఫిబ్రవరి 14న హరి-అషురెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ అనే ఆర్ఫాన్ హోమ్ కి వెళ్లారు. అక్కడే కేక్ కట్ చేసిన వాలెంటైన్స్ వేడుకల్లో పాల్గొన్నారు. మన వద్ద అపరిమితమైన ప్రేమ ఉన్నప్పుడు, అది లేని వాళ్లకు పంచాలని... అషురెడ్డి కామెంట్ చేశారు.

46
Ashureddy

ఇక హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ హోమ్లో ఉన్న పిల్లలతో సమయం గడిపారు. సాధారణ రోజుల్లో అమ్మాయి అబ్బాయి కలిస్తే పెద్ద మేటర్ కాదు. లవర్స్ డే నాడు హరి-అషురెడ్డి కలిసి ఒక మంచి పని చేయడం వార్తలకు ఎక్కింది. తమ లవర్స్ డే వేడుకల ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

56
Ashureddy


మరి హరితో అషురెడ్డికి ఉన్న రిలేషన్ ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు అషురెడ్డి కెరీర్ పై దృష్టి పెట్టారు. ఆమె నటిగా ఎదగాలని కలలు కంటున్నారు. హాట్ ఫోటో షూట్స్ అందులో భాగమే. గ్లామర్ చూపించి మేకర్స్ కంట్లో పడాలి అనుకుంటున్నారు. 

66
AshuReddy

స్కిన్ షోలో అషురెడ్డి బౌండరీలు దాటేస్తున్న క్రమంలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆమె ఫోటో షూట్స్ ఉంటున్నాయనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు ఆమె ఇమేజ్ ని దెబ్బతీశాయి. అయితే ఈ సోషల్ మీడియా విమర్శలు అసలు పట్టించుకోను అంటున్నారామె.

click me!

Recommended Stories