సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత 2021 జనవరిలో రెండో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది. సునీత నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాను ఊపేశాయి. ఒకింత విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సింగర్ సునీత వివరణ ఇచ్చారు. పిల్లలు, నా భవిష్యత్ కోసం కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.