‘నా కొడుకే నాకు నేర్పిస్తున్నాడు’.. పట్టలేని ఆనందంలో కాజల్ అగర్వాల్.. క్యూట్ పిక్స్!

First Published | Feb 15, 2023, 11:19 AM IST

స్టార్ మదర్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన  కొడుకు నీల్ కిచ్లుతో క్యూట్ ఫొటోలను  పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ క్యూటెస్ట్ పిక్ ను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఫ్యాన్స్ కు నిత్యం అందుబాటులోనే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు.

మొదటి లాక్ డౌన్ లోనే కాజల్ అగర్వాల్ పెళ్లైన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 30న ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu)తో గ్రాండ్ వివాహాం జరిగింది. హోమ్ టౌన్ ముంబైలోనే కుటుంబ సభ్యులు, తక్కువ మంది అథితుల మధ్య వేడుక ముగిసింది. 
 


కొద్ది నెలలకే  ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసి.. ఏప్రిల్ 19న 2022న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు కాజల్ అగర్వాల్. పెళ్లి, ప్రెగ్నెన్సీతో కాస్తా సినిమాలకు దూరమైనప్పటికీ.. కుటుంబంతో మాత్రం చాలా సమయం గడుపుతున్నారు.

కొడుకు నీల్ కిచ్లు (Neil Kitchlu) జన్మించాక కాజల్ తన  బిడ్డను చుసుకుంటూ మురిసిపోతోంది. ఈ సందర్భంగా క్యూట్ పిక్స్ ను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులనూ ఖుషీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మరో క్యూటెస్ట్ ఫొటోను షేర్ చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

అయితే, నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా.. భర్తతో ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసుకున్నారు. తాజాగా కొడుకు ప్రేమను కూడా అభిమానులతో పంచుకున్నారు. ‘ఎప్పటికీ సూర్యుడిలా వెలిగిపోతూనే ఉండే వాడు నా కొడుకు నీల్ కిచ్లు నాకు చాలా విలువైనవాడు. అయితే వాలెంటైన్‌లు ఇంకా ముగియలేదు. నీల్ కిచ్లూ నాకు ప్రేమ తాలుకా అర్ధాన్ని ప్రతిరోజూ బోధిస్తూనే ఉన్నాడు.’ అంటూ తల్లిప్రేమను చాటుకుంది. 
 

ఈ సందర్భంగా కాజల్ పంచుకున్న క్యూట్ ఫొటోను అభిమానులతో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. నీల్ కిచ్లూ, కాజల్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తున్నారు. 
 
 

Latest Videos

click me!