Ashu Reddy : ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి’.. ఫాలోవర్స్ కు అషురెడ్డి బెస్ట్ మోటివేషన్!

First Published Jan 2, 2024, 2:38 PM IST

యంగ్ బ్యూటీ అషురెడ్డి Ashu Reddy న్యూ ఈయర్ పోస్ట్ చాలా ఆసక్తికరంగా పెట్టింది. సెలబ్రేషన్స్ కు సంబంధించిన పిక్స్ ఇప్పటికే పంచుకోగా తాజాగా తన ఫాలోవర్స్ కు  ఫిట్ నెస్ మోటివేషన్ ను అందించింది. 

డబ్ స్మాష్ వీడియోలతో జూ.సమంతగా అషురెడ్డి ఫేమ్ అయిన విషయం తెలిసిందే. తన రూపసౌందర్యం, రీల్స్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. అలా సోషల్ మీడియాలో బాగా క్రేజ్ దక్కించుకుంది. ఆ వెంటనే ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలో దెబ్బకు ఫేమ్ అయ్యింది. 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma ఇంటర్వ్యూలతో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకుంది. అలాగే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ఏకంగా రెండు సార్లు మెరిసి టీవీ ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. 
 

Latest Videos


అషురెడ్డి నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో తాజాగా తన ఫాలోవర్స్ కోసం అషురెడ్డి ఇంట్రెస్టింగ్  పోస్ట్ చేసింది. ఫిట్ నెస్ పై మోటివేషన్ అందించేందుకు ప్రయత్నించింది. 

తాజాగా జిమ్ లో వర్క్ చేస్తూ కనిపించింది. సరదాగా ఫొటోలకూ ఫోజులిచ్చింది. స్లిమ్ ఫిట్ బాడీ తో ఆకట్టుకుంది. ఆ ఫొటోలను పంచుకుంటూ తన ఫాలోవర్స్ కూ పలు సూచనలు చేసింది. 2024లో ఏం చేయాలో తనవంతుగా సలహాలు ఇచ్చింది

‘ఈ 2024లో మిమ్మల్ని మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకురండి.. హార్డ్ వర్క్  చేయండి’ అంటూ జిమ్ లో వర్కౌట్ చేసిన తర్వాత పోస్ట్ పెట్టింది. నిజానికి చాలా మంది లైఫ్ స్టైల్ మారాలంటే ఫిట్ నెస్ పై ఫోకస్ చేయాలని చెబుతుంటారు. ఇక సెలబ్రెటీల డైలీ లైఫ్ లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. 

ఇక అషురెడ్డి Bigg Boss Telugu షో తర్వాత సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది. గతంలో ‘ఫోకస్’ అనే చిత్రంలో పోలీస్ అధికారిణిగా అలరించింది. నెక్ట్స్ ‘ఏ మాస్టర్ పీస్’ చిత్రంతో అలరించబోతోంది. 

click me!