Kajal Aggarwal : భర్తను ముద్దుల్లో ముంచేసిన కాజల్.. వాళ్ల గుండెల్లో బాంబ్ పేలినంత పనైంది!

Published : Jan 02, 2024, 11:38 AM IST

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)  తాజాగా న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఈ సందర్భంగా భర్తను ముద్దుల్లో ముంచేస్తూ ఓ ఫొటోను షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు.

PREV
16
Kajal Aggarwal : భర్తను ముద్దుల్లో ముంచేసిన కాజల్.. వాళ్ల గుండెల్లో బాంబ్ పేలినంత పనైంది!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ఎంతో మంది అభిమానులనూ సంపాదించుకుంది.

26

ఫ్యాన్స్ కు కాజల్ సోషల్ మీడియాలో మాత్రం టచ్ లోనే ఉంటారు. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. అభిమానులు కూడా ఆమె ఇచ్చే అప్డేట్స్, షేర్ చేసే పోస్ట్ ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో కాజల్ తన న్యూ ఇయర్ New Year 2024  కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. 

36

భర్త గౌతమ్ కిచ్లు Gautam Kitchlu, కొడుకు నీల్ కిచ్లు, ఫ్రెండ్స్ తో కలిసి కొత్త సంవత్సరపు వేడుకను గ్రాండ్ గా జరుపుకుంది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. పెళ్లికి ముందు, ఆ తర్వాత సోషల్ మీడియాలో కాస్తా పద్ధతిగానే మెరుస్తున్న చందమామా తాజాగా ఫ్యాన్స్ గుండెల్లో బాంబ్ పేల్చింది.
 

46

ఎందుకంటే...  తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్, కలల రాణిగా ఊహించుకున్న కుర్రాళ్లతో... కాజల్ తన భర్తకు లిప్ లాక్ ఇచ్చిన ఫొటోను పంచుకోవడంతో కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం భర్తతో రొమాంటిక్ స్టిల్ కు బాగుందని అంటున్నారు. 
 

56

మరికొందరు కాజల్ చెల్లి నిషా అగర్వాల్ Nisha Aggarwal నూ గుర్తు చేస్తున్నారు. చెల్లెలు ఎక్కడ అంటూ అడుగుతున్నారు. మొన్నటి వరకు అక్కాచెళ్లెలు కలిసి చేసిన ఫొటోషూట్ చాలా వైరల్ అయ్యింది.  ఈక్రమంలో న్యూ వేడుకల్లో ఆమెను గుర్తు చేశారు. 
 

66

ఈ ఏడాది కాజల్ కు మరింత మంచి జరగాలని, ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నారు. కాజల్ కు ఫ్యాన్స్ న్యూ ఈయర్ విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘సత్యభామ’, ‘ఉమా’, అలాగే కమల్ హాసన్ సరసన ‘ఇండియన్2’ (Indian 2)లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories