సెన్సార్ బోర్డు బ్యాన్ చేసిన సినిమా ఆహాలోకి..బోల్డ్ మ్యాటర్ గురించి తెలిస్తే ఇదేం దరిద్రం అనాల్సిందే.. 

First Published | Aug 14, 2024, 2:46 PM IST

ఆగష్టు 15న ఆహాలో రిలీజ్ కాబోతున్న ఒక చిత్రం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కాకుండా సెన్సార్ బోర్డు బ్యాన్ చేసేసింది.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటిటిల్లో బోల్డ్ కంటెంట్ తో ఉన్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు బోలెడన్ని ఉన్నాయి. కానీ అవన్నీ థియేటర్స్ లో ప్రదర్శించేందుకు వీలు లేని చిత్రాలు. తెలుగులో అయితే ఆహా ఓటిటి వేదిక బాగా పాపులర్ అయింది. ఆహా ఓటిటికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు ఆహాలో మితిమీరిన బోల్డ్ కంటెంట్ రాలేదు. 

కానీ పోటీని తట్టుకునేందుకో ఏమో కానీ ఇటీవల ఆహా కూడా కాస్త రొమాన్స్, బోల్డ్ గా ఉన్న కంటెంట్ ని రిలీజ్ చేస్తోంది. ఆగష్టు 15న ఆహాలో రిలీజ్ కాబోతున్న ఒక చిత్రం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కాకుండా సెన్సార్ బోర్డు బ్యాన్ చేసేసింది. అలాంటి చిత్రాన్ని ఆహా రిలీజ్ చేస్తుండడం తీవ్ర చర్చనీయాంశం గా మారింది. 


ఆ మూవీ టైటిల్ Evol.. ఈ టైటిల్ విచిత్రంగా అనిపిస్తున్నప్పటికీ రివర్స్ చేసి చూస్తే క్లారిటీ వస్తుంది. అదే Love.. ప్రేమ తిరగబడితే, ప్రేమకి కొత్త అర్థం జోడిస్తే ఏమవుతుందో అనే విషయాన్ని డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి బోల్డ్ గా చూపించారు. 

ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి తెలిస్తే ఇదేం దరిద్రం బాబోయ్ అని నోరెళ్లబెట్టాల్సిందే. ఈ చిత్రంలో కొత్త నటీనటులు నటించారు. తన భర్తతో పాటు అతడి స్నేహితుడిని కూడా ప్రేమిస్తుంది ఆ యువతి. ఇద్దరినీ ఒకేసారి ప్రేమించడం.. అండర్ స్టాండింగ్ తో ఒకేసారి భర్త, అతడి స్నేహితుడితో శృంగారం చేయడం లాంటి విచిత్రమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

చూస్తుంటే ఈ చిత్రం మొత్తం బోల్డ్ సన్నివేశాలే ఉన్నట్లు ఉన్నాయి. పెళ్లయ్యాక మరి వ్యక్తిని ప్రేమించే కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చాయి కానీ.. భర్తతో పాటు అతడి స్నేహితుడితో ఒకేసారి రిలేషన్ మైంటైన్ చేసే కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు రాలేదు. 

ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ట్రోలింగ్ మొదలయింది. ఇక రిలీజ్ అయ్యాక ఎలాంటి కాంట్రవర్సీ అవుతుందో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అంటున్నారు. 

Latest Videos

click me!