పిల్లల దగ్గరికి వచ్చి ముందుగా ఆర్య దంపతులు అనుకున్న పేర్లు ఆరాధ్య, ఆదిత్య పేర్లు పెట్టడానికి నిశ్చయించుకుంటుంది అను. మీ నానమ్మ వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా జరగవలసింది ఇంత చిన్న ఇంట్లో మీ నామకరణం జరుగుతుంది మీ వైభోగాన్ని దూరం చేసినందుకు నన్ను క్షమించండి అని బాధపడుతుంది అను. మరోవైపు ఇల్లంతా అలంకరించి ఉయ్యాలకి డెకరేషన్ చేసి ఆనందిస్తూ ఉంటారు అంజలి, నీరజ్. పిల్లలకి గిఫ్ట్లు కొనటం మర్చిపోయాం అంటూ తెగ హడావిడి పడుతూ ఉంటారు. ఇంతలోనే మాన్సీ కిందికి వచ్చి మిమ్మల్ని చూస్తుంటే ఎప్పుడో జెండే చెప్పిన ఒక సామెత గుర్తొస్తుంది అంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.