Arjun Sarja: అర్జున్‌ చెంప చెల్లుమనిపించిన డైరెక్టర్‌.. కోపంతో ఊగిపోయిన యాక్షన్‌ కింగ్‌ ఏం చేశాడంటే

Published : Jun 04, 2026, 09:26 PM IST

'బ్లాస్ట్' సినిమాతో గ్రాండ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చిన నటుడు అర్జున్ సర్జా, తాను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. షూటింగ్ సెట్‌లో ఒక డైరెక్టర్ తనని చెంపదెబ్బ కొట్టారని వెల్లడించారు.

PREV
15
బ్లాస్ట్ తో అర్జున్‌ హీరోగా కమ్‌ బ్యాక్‌

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వచ్చి, సౌత్ ఇండియా సూపర్‌స్టార్ గా ఎదిగారు అర్జున్ సర్జా. 90వ దశకంలో విజయ్, అజిత్, రజినీకాంత్, కమల్ హాసన్ రేంజ్‌లో ఈయనకు స్టార్‌డమ్ ఉండేది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన 'యాక్షన్ కింగ్'గానే సుపరిచితులు. తెలుగులోనూ అనేక సినిమాలు చేసి మెప్పించారు. ఇక్కడ కూడా స్టార్‌గా రాణించారు, రాణిస్తున్నారు. 2005 వరకు హీరోగా మెరిసిన ఆయన, ఆ తర్వాత విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించారు. కానీ ఇప్పుడు 'బ్లాస్ట్' అనే  సినిమాతో హీరోగా కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఈ సినిమా విజయవంతంగా రన్‌ అవుతోంది. 

25
అర్జున్‌ హిట్‌ కొట్టడంపై అభిమానులు హ్యాపీ

తమ 'యాక్షన్ కింగ్' తిరిగి హీరోగా సక్సెస్‌ కొట్టడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా 'బ్లాస్ట్' సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సంతోషంలోనే, అర్జున్ సర్జా తాను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. 

35
డైరెక్టర్‌ చేతిలో చెంప దెబ్బతిన్న అర్జున్‌

 1985లో విడుదలైన 'సింహద మరీ సైన్య' అనే  సినిమాలో డైరెక్టర్ రాజేంద్ర సింగ్ బాబు తనను కొట్టారని అర్జున్ సర్జా చెప్పారు. ఎందుకు కొట్టారో కూడా ఆయనే వివరించారు. 'సినిమా షూటింగ్ మొదటి రోజే నేను డైరెక్టర్ చేతిలో దెబ్బలు తిన్నాను. కథలో ఒక అబ్బాయి చనిపోయే సీన్ ఉంది. ఆ సీన్‌నే అప్పుడు షూట్ చేస్తున్నారు' అని అర్జున్ తెలిపారు.

45
ఏడవమంటే నవ్విన అర్జున్‌
డైరెక్టర్ నన్ను ఏడుస్తూ నటించమని చెప్పారు. కానీ నాకు ఏడుపు రాలేదు. పైగా, పక్కన ఉన్నవాళ్లంతా జోకులు వేసి నవ్విస్తున్నారు. దాంతో నాకు నవ్వు ఆగలేదు. అప్పుడు డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా చెంపపై కొట్టారు. నేను షాక్ అయ్యాను. కళ్ళు ఎర్రగా మారి, కన్నీళ్లు వచ్చేశాయి.
55
16ఏళ్ల వయసులో అర్జున్‌ సిక్స్ ప్యాక్‌

'తిరిగి డైరెక్టర్‌ను కొట్టేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, ఎలాగో కంట్రోల్ చేసుకున్నాను. అప్పుడు డైరెక్టర్, 'ఇప్పుడు సరిపోయింది, షాట్ రెడీ' అన్నారు' అని అర్జున్  ఆ సంఘటనను గుర్తుచేసుకున్నారు. 'నాకు 16-17 ఏళ్ల వయసులోనే సిక్స్ ప్యాక్ ఉండేది, కానీ అప్పట్లో ఆ కల్చర్ లేదు' అని అర్జున్‌ చెప్పడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories