రామ్ చరణ్ నటించిన `పెద్ది` మూవీ మొదటి రోజు ఎంత కలెక్షన్లని సాధించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రం ప్రభాస్, ఎన్టీఆర్ మూవీల రికార్డులను బ్రేక్ చేయబోతుందట.
రామ్ చరణ్ హీరోగా నటించిన `పెద్ది` సినిమా థియేటర్‌లో సందడి చేస్తుంది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ గురువారం(జూన్ 4)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య, భారీ స్థాయిలో దీన్ని రిలీజ్ చేశారు. రామ్ చరణ్ చివరి మూవీ `గేమ్ ఛేంజర్` బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేయడంతో ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. రామ్ చరణ్ కూడా అంతే కసితో సినిమాలో నటించారు.
25
నటనతో దుమ్ములేపిన రామ్ చరణ్
బుధవారం రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. అభిమానులను అలరించే యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు లేవని అంటున్నారు. స్లోగా సాగుతుందనే కామెంట్ వస్తుంది. డ్రైగా ఉందని చెబుతున్నారు. కానీ రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. నటుడిగా చరణ్ విశ్వరూపం చూపించారని చెబుతున్నారు. నిజానికి చరణ్ తన కెరీర్ బెస్ట్ యాక్టింగ్‌ని ఇందులో చూపించారని చెప్పొచ్చు. ఒకప్పుడు తన నటనపై విమర్శలు వచ్చేవి, కానీ ఇప్పుడు బెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం.
35
భారీ స్థాయిలో పెద్ధి ఓపెనింగ్స్
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన `పెద్ది` సినిమాకి ఇప్పటికైతే టాక్ మిక్స్ డ్‌గానే ఉంది. మరో రెండు మూడు రోజులు అయితే గానీ స్పష్టంగా మూవీ రిజల్ట్ ఏంటనేది క్లారిటీ రాదు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేస్తుంది. ప్రీమియర్స్ ద్వారా ఎంత వసూలు చేసిందనేది చూస్తే, ఆసక్తికర లెక్కలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు భారీగా వసూలు చేయబోతుందని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఇప్పటి వరకు బుక్ అయిన టికెట్ లెక్కల ప్రకారం సినిమా గట్టిగానే రాబడుతుందని అంటున్నారు.
పెద్ది సినిమా ప్రీమియర్స్ ద్వారా సుమారు రూ.38కోట్లు రాబట్టిందట. ఇండియాలోనే ఇరవై కోట్ల వరకు వచ్చాయని, ఓవర్సీస్‌లోనూ గట్టిగానే సాధించిందని టాక్. ఇక పెద్ది ఓపెనింగ్ కలెక్షన్ల వివరాలు చూస్తే అదిరిపోతున్నాయి. ఈ చిత్రం మొదటిరోజు రూ.120-130 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు సేల్ అయిన టికెట్లని బట్టి ఈ లెక్క చెబుతున్నారు. అయితే ఈ రోజు ఫినిష్ అయ్యే దాన్ని బట్టి ఇందులో స్వల్పంగా మార్పు ఉండే అవకాశం ఉంది. కానీ రామ్ చరణ్ కెరీర్‌లో మరో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా `పెద్ది` నిలుస్తుందని అంటున్నారు.
55
ప్రభాస్, ఎన్టీఆర్ మూవీస్ ని దాటబోతున్న పెద్ది
రామ్ చరణ్ చివరా నటించిన `గేమ్ ఛేంజర్` రూ.186కోట్లు రాబట్టిందని పోస్టర్లో వేశారు. నిజానికి అందులో సగమే వచ్చాయని టాక్. ఆ లెక్కన `పెద్ది` చరణ్ గత చిత్రాన్ని దాటేస్తుందని చెప్పొచ్చు. అదే సమయంలో ప్రభాస్, ఎన్టీఆర్ చిత్రాలను కూడా ఈ మూవీ దాటబోతుంది. ప్రభాస్ చివరి మూవీ `ది రాజా సాబ్`. మొదటి రోజు ఇది రూ.95కోట్లు రాబట్టింది. ఎన్టీఆర్ నటించిన `వార్ 2` కూడా రూ.85కోట్లు సాధించింది. ఈ రెండు చిత్రాలను `పెద్ది` దాటబోతుందని టాక్. మరి ఏ స్థాయిలో సత్తా చాటుతుందో చూడాలి.