ఈ సందర్భంగా తన భర్తకి సురేఖ కొన్ని సలహాలు ఇచ్చారు. సైలెంట్‌గా ఉంటున్నావని, రియాక్ట్ కావడం లేదని, ఎమోషన్స్ ని బయటపెట్టమని తెలిపింది. బిగ్ బాస్ కప్ ఇంపార్టెంట్ అని చెప్పింది. మరోవైపు కడుపులో చిన్నారి కదులుతుందని, రాత్రిళ్లు నిద్ర పోనివ్వడం లేదని తెలిపింది. ఇక బయట ఏం జరుగుతుందని అడగ్గా, తెలియదు, గుర్తు లేదు మర్చిపోయాను అంటూ, అలాగే అశ్వినిని పట్టుకుని మా ఆయన అంటే భయం పోయిందా అంటూ కామెంట్ చేస్తూ నవ్వులు పూయించింది సురేఖ.