అనుష్క శెట్టి బరువు తగ్గకపోవడానికి కారణం అదేనా? అందుకే బయటికి రావట్లేదా.!

First Published | Nov 7, 2023, 2:32 PM IST

టాలీవుడ్ స్విటీ, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కొన్నాళ్లుగా పబ్లిక్ అపియరెన్స్ కు దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా తన సినిమానూ తను కనిపించకుండానే ప్రమోట్ చేసుకుంది. వీటన్నింటికి కారణం తను బరువు పెరగడమే అని అంటున్నారు.! 
 

టాలీవుడ్ లో అనుష్క శెట్టి (Anushka Shetty)కి స్పెషల్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలతో కలిసిన నటించిన స్విటీ  ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.. అడపదడపా నటిస్తూ వస్తున్నారు. కనీసం పబ్లిక్ అపీయరెన్స్ కూడా ఫ్యాన్స్ కు కరువైపోయింది. 
 

రీసెంట్ గా వచ్చిన తన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్ర ప్రచారంలోనూ అనుష్క శెట్టి కనిపించలేదు. ఒకటి రెండు ఇంటర్వ్యూలు మినహా పెద్దగా పబ్లిక్ తనను చూపించడానికి ఇష్టపడలేదు. ఇందుకు కారణం స్విటీ బరువు పెరగడమే అంటున్నారు. అందుకు బయటికి కూడా రావల్లేదని తెలుస్తోంది. 


‘సైజ్ జీరో’ డైరెక్టర్‌ ప్రకాష్‌ కోవెలమూడి కారణంగానే ఆమె అనారోగ్య సమస్యలు ఫేస్‌ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో ఏకంగా 20 కేజీల బరువు పెరిగింది. ఆ తర్వాత నుంచి అనుష్క బరువు తగ్గడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. ఎంత ప్రయత్నించినా తను వెయిట్ తగ్గలేకపోతుందంట. 
 

అయితే ఒకేసారి బరువు పెరగడంతో అనుష్క polycystic ovary syndrome (PCOS)తో బాధపడుతున్నట్టు గతంలో తెలిపారు. దీని వల్ల హార్మోనల్ డిజార్డర్ కు గురై బరువు పెరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు. అతిగా బరువు పెరగడంతో స్విటీకి మరిన్ని హెల్త్ ఇష్యూస్ ను ఫేస్ చేస్తుందని అంటున్నారు. దీనిపై స్పష్టత లేదు. 

ఏదేమైనా ఆ మధ్య లో ఫ్యామిలీతోకలిసి ఓ టెంపుల్ కు వచ్చిన సమయంలోనూ బరువునుగానే కనిపించారు. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్ర ప్రచారానికి ఎంత దూరంగా ఉన్నారో తెలిసిందే. అందుకే సినిమాలు చేయకపోవడానికి ఓ కారణం అంటున్నారు. మరోవైపు తను పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వకపోవడానికి కూడా ఇదే రీజన్ అని తెలుస్తోంది.

‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో నటించిన అనుష్క మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు కావడం విశేషం. నేటితో స్విటీ 42వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అభిమానులకు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. 

Latest Videos

click me!