Bigg Boss Telugu 7
పదవ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. లేడీ కంటెస్టెంట్స్ అశ్విని, రతిక, ప్రియాంక, శోభలను రాజమాతలుగా బిగ్ బాస్ నిర్ణయించాడు. మిగిలిన మేల్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో పాల్గొన్నారు. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ ని కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి చేశారు. నామినేషన్ కి చెప్పే పాయింట్స్ వ్యాలిడ్ గా ఉన్నాయా లేదా అనేది రాజ మాతలు తేలుస్తారు.
Bigg Boss Telugu 7
శివాజీ, యావర్, గౌతమ్ భోలే నామినేట్ అయ్యారు. ఇక రాజమాతలు తమలో తాము ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. శోభ కెప్టెన్ కాగా ఆమెకు మినహాయింపు దక్కింది. ప్రియాంక, రతిక ,అశ్విని కంటే రతికకు ఎక్కువ వ్యతిరేక ఓట్లు పడ్డాయి. దాంతో ఆమె నామినేట్ అయ్యింది. మొత్తంగా ఐదుగురు నామినేషన్స్ లోకి వచ్చారు.
Bigg Boss Telugu 7
సోమవారం రాత్రి నుండే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఊహించినట్లే శివాజీ దూసుకుపోతున్నాడని సమాచారం. ఐదుగురిలో మెజారిటీ ఓట్లు ఆయనకే పడుతున్నాయి. అనూహ్యంగా రెండో స్థానంలో భోలే ఉన్నాడట. మొదట్లో భోలే హౌస్లో మెజారిటీ సభ్యులు టార్గెట్ చేశారు. అతడికి ఒక లక్ష్యం లేదు, గేమ్ ఆడటం లేదన్నారు.
అయితే ప్రేక్షకుల్లో భోలేకి ఆదరణ పెరిగినట్లు క్లియర్ గా తెలుస్తుంది. ప్రతిసారి నామినేషన్స్ లో ఉంటున్న భోలే... సేవ్ అవుతున్నాడు. ఈసారి కూడా భోలేకి ఓట్లు బాగానే పడుతున్నాయని సమాచారం.
మూడో స్థానంలో గౌతమ్ ఉన్నాడట. డాక్టర్ కమ్ యాక్టర్ స్ట్రాంగ్ పీఆర్ టీమ్ లను మైంటైన్ చేస్తున్నాడు. గేమ్ పరంగా కూడా పర్లేదు. తరచుగా శివాజీతో గౌతమ్ కి వార్ జరుగుతుంది. శివాజీ మీద కొన్ని ఆరోపణలు చేసిన గౌతమ్ నాగార్జున చేత చివాట్లు తిన్నాడు. దీంతో అతడు మూడో స్థానంలో ఉన్నాడు.
Bigg Boss Telugu 7
ఊహించని విధంగా యావర్ నాలుగో స్థానంలో ఉన్నాడట. రతిక రీఎంట్రీ యావర్ కొంప ముంచింది. గేమ్ మీద ఫోకస్ తగ్గి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. ఇది యావర్ కి బాగా మైనస్ అయ్యింది. ఈ క్రమంలో యావర్ డేంజర్ జోన్లోకి వచ్చాడట.
ఇక చివరి స్థానంలో రతిక రోజ్ ఉన్నట్లు సమాచారం. అందరి కంటే రతిక రోజ్ కి తక్కువ ఓట్లు పడ్డాయట. బయటకు వెళ్లి వచ్చాక రతిక గేమ్ ఇంకా దెబ్బ తిండి. అటాకింగ్ గేమ్ ఆడాలా లేక కామ్ గా ఉండాలా అనేది అర్థం కావడం లేదు. ఆమె గేమ్ ప్రేక్షకులను కదిలించడం లేదు.
యావర్-రతిక మధ్య స్వల్ప ఓట్ల వ్యత్యాసం ఉందట. చెప్పాలంటే ఇద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. శుక్రవారం వరకు టైం ఉంది. ఇదే ఓటింగ్ ట్రెండ్ కొనసాగితే రతిక లేదా యావర్ ఇంటిని వీడటం ఖాయం. ఇక 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే...