అరియానా ఇంతగా ఓపెన్‌ అయ్యిందేంటి?.. నెవర్‌ బిఫోర్‌ హాట్‌ షో.. వీడియో వైరల్‌

First Published | Oct 26, 2021, 4:16 PM IST

బిగ్‌బాస్‌ 4 బ్యూటీ అరియానా గ్లామరస్‌గా కనిపించడం కొత్తేమి కాదు. బోల్డ్ నెస్‌ ఆమె బాడీలో, ఆమె మాటల్లోనే ఉంది.  అదే బోల్డ్ నెస్‌తో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ని ఓ ఊపుఊపేసింది. కానీ తాజాగా మాత్రం ఊహించని గ్లామర్‌షోతో షాకిస్తుంది. 
 

అరియానా గ్లోరీ(Ariyana Glory).. బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. టాప్‌ 5లో చోటు సంపాదించుకుని మేల్‌ కంటెస్టెంట్లకి షాకిచ్చింది. సోహైల్‌ లాంటి వారికే చుక్కలు చూపించింది. ఆమె ఆట తీరుకి, వేగానికి అంతా ఫిదా అయ్యారు. ఫైనల్‌గా ఆ సీజన్‌లో ఊహించిన పాపులారిటీ, క్రేజ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకుంది అరియానా. అందరి ప్రశంసలందుకుంది. 
 

అయితే ఆ తర్వాత కూడా వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోతూ వచ్చింది. గ్లామర్‌ యాంగిల్‌ని చూపిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంది. కామెడీ స్టార్స్ వంటి షోలతో సందడి చేసింది Ariyana. అవినాష్‌తో వరుసగా షోస్‌లో పాల్గొని తమ కెమిస్ట్రీని మరింత రక్తికట్టించారు. వీరిద్దరు బిగ్‌బాస్‌4లో ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేసిన విషయం తెలిసిందే. వీరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కావాల్సిన వినోదాన్ని పంచింది. 


ఆ తర్వాత డిఫరెంట్‌ టీవీ షోస్‌లో సందడి చేస్తూ రాణిస్తున్న అరియానా.. తనకి లైఫ్‌ ఇచ్చిన రామ్‌గోపాల్‌తో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసి అందరికి షాకిచ్చింది. అసభ్యకర యాంగిల్స్ లో కెమెరాతో చిత్రీకరించిన ఇంటర్వ్యూ విజువల్స్ నెట్టింట దుమారం రేపాయి. పలు విమర్శలు వచ్చాయి. అయితే దాన్ని సమర్ధించుకున్న అరియానా అది వర్మ స్టయిల్‌ అని, అన్ని విషయాలకు తాను సిద్ధమయ్యే వర్కౌట్‌ సెషన్‌లో ఇంటర్వ్యూ చేశామని తెలిపింది. 
 

ఆ ఇంటర్వ్యూ తెగ వైరల్‌ కావడమే కాదు, యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కొన్ని రోజులపాటు ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ ఇంటర్వ్యూతో కొన్ని విమర్శలతోపాటు అనేక ప్రశంసలు, వెలకట్టలేని పాపులారిటీని, పబ్లిసిటీని దక్కించుకుంది అరియానా. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. 

ఇదిలా ఉంటే అరియానా గ్లామర్‌ సైడ్‌లో మరికాస్త డోస్‌ పెంచింది. అందాల ఆరబోత విషయంలో బార్డర్స్ బ్రేక్‌ చేసిందా అనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. తాజాగా ఆమె ఓ వీడియోని పంచుకుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌కి సంబంధించిన వీడియో ఇది. ఇందులో పింక్‌ ట్రెండీవేర్‌లో మెరిసింది అరియానా. కాకపోతే బ్లౌజ్‌ లేకుండా టూ పీస్‌ బికినీని గట్టిగా ముడేసి టాప్‌ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. బ్యాక్‌ అందాన్ని ఓపెన్‌గా చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది.
 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత హాట్‌ వీడియోని అరియానా పంచుకోవడంతో అభిమానులు షాక్‌కి గురవుతున్నారు.  ఈ రేంజ్‌లో రెచ్చిపోవడమేంటని కామెంట్లు చేస్తున్నారు. తనని ఇలా ఊహించుకోలేకపోతున్నామని, సో సెక్సీగా ఉందంటున్నారు నెటిజన్లు.  చాలా అందంగా ఉన్నావని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. మోడల్స్ ని, స్టార్‌ హీరోయిన్లని మించిపోతున్నావని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు అరియానా వీడియోని వైరల్‌ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అరియానా వీడియో నెట్టింట దుమారం రేపుతుంది. 

అరియానా ప్రస్తుతం బిగ్‌బాస్‌5కి సంబంధించిన `బిగ్‌బాస్‌5 బజ్‌` షోకి హోస్ట్ గా చేస్తుంది. బిగ్‌బాస్‌5వ సీజన్‌లో జరిగే ఆసక్తికర విషయాలను పంచుకోవడంతోపాటు ఎలిమినేట్‌ అయినా కంటెస్టెంట్ల నుంచి ఆసక్తికర విషయాలను, రహస్యాలను రాబడుతూ ఆకట్టుకుంటుంది. నిత్యం సందడి చేస్తుంది. 
 

దీంతోపాటు అరియానా ఇటీవల `స్టార్‌మా పరివార్‌ అవార్డుల` వేడుక రెడ్‌ కార్పెట్‌కి హోస్ట్ గా వ్యవహరించింది. ఇందులో రెడ్‌ కార్పెట్‌లో పాల్గొనే టీవీ నటీనటుల అభిప్రాయాలు తీసుకుంటూ ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ఓ అవార్డుని కూడా దక్కించుకుంది. Ariyana Hot Photos.

also read: భూమిక మైండ్ బ్లోయింగ్ హాట్.. భర్తతో విభేదాల గురించి పరోక్షంగా పోస్ట్, ఫోటోస్ వైరల్
 

Latest Videos

click me!