స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో స్టైలిష్ ఫోజులిస్తున్న మెగా డాటర్ నిహారిక... అమ్మడు ఆనందం వెనుక కారణం అదేనా!

First Published | Oct 26, 2021, 1:11 PM IST


ఎల్లో కలర్ డిజైనర్ వేర్ లో స్టైలిష్ గా కనిపించారు నాగబాబు ముద్దుల తనయ నిహారిక. ట్రెండీ బట్టలలో ఆమె కిరాక్ ఫోజులు ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. 

నిహారిక వివాహం జరిగింది దాదాపు ఏడాది కావస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో Niharika kondiela పెద్దలు నిశ్చయించిన జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ ప్యాలస్ నిహారిక వివాహ వేడుకకు వేదిక అయ్యింది. మెగా హీరోలందు హాజరైన ఈ పెళ్లి వేడుక ఐదురోజుల పాటు సాగింది. నిహారిక వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 
 

నిహారిక భర్త వెంకట చైతన్య ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నటనను కొనసాగించే అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితో నిహారిక తనకు ఇష్టమైన యాక్టింగ్ ప్రొఫెషన్ పెళ్లి తరువాత కూడా కొనసాగిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతికి జంటగా నిహారిక నటించిన తమిళ చిత్రం విడుదల కావాల్సి ఉంది. 
 


అలాగే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తున్నారు. అనసూయ మరో కీలక రోల్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది.

 గతంలో నిహారిక మ్యాడ్ హౌస్, నాన్న కూచి, ముద్దపప్పు ఆవకాయ్ వంటి సిరీస్ లలో నటించి, నిర్మించారు. 
ఫస్ట్ ఇన్నింగ్స్ లో నిహారిక ఫెయిల్ అని చెప్పాలి. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దీనితో ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ఓ స్థాయి హీరోయిన్ గా ఎదగాలని ఆశపడుతున్నారు. 

అందుకే సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనిత డోంగ్రే రూపొందించిన డిజైనర్ వేర్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చారు. నిహారిక లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 
 


అటు భార్యగా, ఇటు నటిగా రాణిస్తూ హ్యాపీ లైఫ్ అనుభవిస్తుంది నిహారిక. ఆ మధ్య నిహారిక, చైతన్య నివసిస్తున్న ప్లాట్ లోని పొరుగువారు... వీరిపై న్యూసెన్స్ ఆరోపణలు చేశారు. పార్టీల పేరుతో రాత్రి నిద్రపోకుండా అల్లరి చేస్తున్నారంటూ పోలీసులకు పిర్యాదు చేశారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. 
 

అలాగే Pawan kalyan పై నటుడు పోసాని కృష్ణమురళి ఘాటు విమర్శలు చేయగా, నిహారిక స్పందించారు. పోసానిని మెంటల్ హాస్పిటల్ లో చేర్చాలని, అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కామెంట్ చేశారు.

Also read Bigg boss telugu 5:ఎలిమినేటైన ప్రియ ఏడు వారాలకు ఎంత తీసుకున్నారంటే.. దక్కింది తక్కువే!

Also read తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ ఫైటింగ్... ఆ రోజుల్లోనే గ్రూపులు కట్టిన రౌడీ హీరో

Latest Videos

click me!