అప్పుడు దారుణంగా ట్రోలింగ్, విజయ్ దేవరకొండ తమ్ముడి రేంజ్ మారిపోయిందా.. 25 మంది తమిళ డైరెక్టర్లు ఆనంద్ కోసం

First Published May 24, 2024, 1:30 PM IST

విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ బిగినింగ్ లో చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అతడిపై నెగిటివిటి విపరీతంగా కనిపించింది. 

విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ బిగినింగ్ లో చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అతడిపై నెగిటివిటి విపరీతంగా కనిపించింది. యాక్టింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేదు. 

ఒక దశలో ఆనంద్ దేవరకొండ హీరోగా నిలదొక్కుకోగలడా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఒక్క చిత్రంతో అందరికి సమాధానం ఇచ్చాడు. బేబీ చిత్రంలో భగ్న ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. 

ఆ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరింది. చిన్న సినిమాల్లో అతిపెద్ద విజయంగా నిలిచింది. బేబీ చిత్రం తర్వాత ఆనంద్ దేవరకొండకి వరుస చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో దర్శకుడు ఆనంద్ దేవరకొండ కోసం ప్రయత్నిస్తున్నారట. 

ఈ విషయాన్ని స్వయంగా ఆనంద్ దేవరకొండ రివీల్ చేశాడు. బేబీ మూవీ తర్వాత పెద్ద దర్శకులు నా దగ్గరకి రాలేదు. కానీ 100 మంది దర్శకులు స్క్రిప్ట్స్ తో వచ్చారు. వారిలో చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ ఉన్నారు. దాదాపు 25 మంది తమిళ దర్శకులు అద్భుతమైన కథలతో వచ్చారు అని ఆనంద్ దేవరకొండ తెలిపారు. 

తమిళ డైరెక్టర్లు నా కోసం రావడం చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీనితో ఆనంద్ దేవరకొండ రేంజ్ మారిపోయింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీరో నుంచి ఈ స్థాయిలో ఎదగడం నిజంగా గొప్ప విషయమే అని అంటున్నారు. 

ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ గంగం గణేశా చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ క్రైమ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో మంచి అంచనాలే కనిపిస్తున్నాయి. 

click me!