ఈరోజు ఎపిసోడ్ లో మాలిని, మల్లీ ఇబ్బంది పడే మాటలే కాదు మల్లీకి నీకు పెళ్లి అయ్యింది అని మాట్లాడిన మాటలకు నీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలాబాధేసింది అంటుంది మాలిని. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా తీసుకుంటారు నా నమ్మకం లేదు కదా అని అంటుంది మాలిని. ఎందుకు మాలిని ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావ్ అనడంతో ఇది నీకు చిన్న విషయమే కావచ్చు కానీ ఆడపిల్లకు ఇది చాలా పెద్ద విషయం అంటుంది. అక్కడ జర్నలిస్టులు మల్లీని మాత్రమే కాదు నిన్ను కూడా టార్గెట్ చేశారు ఆ విషయం నీకు అర్థం కావడం లేదా అంటుంది. నేను ఎవరో అన్న మాటలు గుర్తుపెట్టుకుని అనడం లేదు సిద్ధాంతి గారు అన్న మాటలను మనసులో గుర్తు పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాను అంటుంది మాలిని.