Eesha Rebba: కన్ను కొట్టి నాలుక మడత పెట్టి కవ్విస్తున్న తెలుగు పిల్ల... విరహ వేదన తాళలేకున్న ఈషా రెబ్బా!

First Published Feb 7, 2023, 1:28 PM IST

కుర్రాళ్లను కవ్వించడమే పనిగా పెట్టుకుంది ఈషా రెబ్బా. ఈ తెలుగు భామ సోషల్ మీడియా ఫోటో షూట్స్ దెబ్బకు కుర్రాళ్ళు కుదేలు అవుతున్నారు. 
 

Eesha Rebba


తాజాగా హాట్ ట్రెండీ వేర్ ధరించిన ఈషా కన్ను కొడుతూ, నాలుగు మడత పెడుతూ రెచ్చగొట్టింది. ఈ బోల్డ్ బ్యూటీ గ్లామర్ కే టెంప్ట్ అయ్యే కుర్రాళ్లు, రెచ్చగొట్టే చర్యలకు మరింత బేజారు అవుతున్నారు. కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 

Eesha Rebba


హాట్ ఫోటో షూట్స్ తో ఈషా సోషల్ మీడియా ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు అనిపిస్తుంది.  సినిమా ఆఫర్స్ లేని తారలకు ఇంస్టాగ్రామ్ ఒక ఆదాయ వనరు. ఫాలోవర్స్ పెంచుకొని కొంతలో కొంత డబ్బులు ఆర్జించవచ్చు. సక్సెస్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో హీట్ పుట్టించే ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. 

Eesha Rebba


ఇక ఈషా చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈషాను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆమె ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది. ఈషా ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు. మలయాళంలో ఈషా నటించిన 'ఒట్టు' విడుదలై పెద్దగా ప్రభావం చూపలేదు. అలాగే ఒక నితమ్ ఒరు వానమ్ చిత్రంలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. 

Eesha Rebba


తమిళంలో ఆయిరం జన్మంగళ్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల విజయాలపై ఈషా ఆశలు పెట్టుకున్నారు.  టాలీవుడ్ లో దాదాపు ఆమె ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. కనీసం సెకండ్ హీరోయిన్ అవకాశాలు కావడం రావడం లేదు. తెలుగులో హీరోయిన్ గా రాణించే అవకాశం దాదాపు లేనట్లే.

Eesha Rebba


మంచి గ్లామర్, టాలెంట్ ఉండి  కూడా ఈషా(Eesha Rebba) కెరీర్ లో ఎదగలేక పోయారు. తెలుగు హీరోయిన్స్ పట్ల పరిశ్రమలో ఉన్న వివక్ష కూడా ఈషా ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.ఆమెకు అడపాదడపా అవకాశాలు తప్పితే బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ దక్కడం లేదు.  తెలుగులో చుక్కెదురు కాగా ఇతర భాషల్లో అయినా ఆమెకు బ్రేక్ వస్తుందేమో చూడాలి. 
 

Eesha Rebba


కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. 
 

Eesha Rebba


అక్కినేని హీరో అఖిల్  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది.

Eesha Rebba


టాలీవుడ్ లో బెటర్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూనే, ఇతర పరిశ్రమలపై ఫోకస్ పెట్టింది. తెలుగులో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య వంటి తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ లో హీరోయిన్స్ గా ఓ స్థాయికి వెళ్లారు. మరి ఈషా రెబ్బా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు.

click me!