లెహంగాలో డైమండ్ లా మెరిసిపోతున్న రకుల్.. ఎద అందాలతో మత్తెక్కిస్తున్న స్టార్ బ్యూటీ!

First Published | Feb 7, 2023, 1:37 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet singh) ట్రెడిషనల్ అందాలతో మతులు పోగొడుతోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూనే గ్లామర్ మెరుపులతో కుర్రగుండెల్లో అలజడి రేపుతోంది.
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో ఊపూపింది. స్టార్ హీరోల సరసన వరుస చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించింది. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. 
 

రకుల్ కు స్టార్ హీరోయిన్ గా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి రీసెంట్ గా హిందీ చిత్రం ‘ఛత్రీవాలి’తో అలరించింది. జనవరి 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాను బాగా ప్రమోట్ చేసుకుంటోంది. 
 


సినిమాలతో  బిజీగా ఉంటున్న రకుల్.. ఫ్యాన్స్ ను సోషల్ మీడియాలోనూ టచ్ లోనే ఉంటున్నారు. క్రేజీ అప్డేట్స్ తో ఖుషీ చేస్తున్నారు. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ విందు చేస్తూ కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. 
 

తాజాగా రకుల్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. సిల్వర్ లెహంగాలో రకుల్ డైమండ్ లా మెరిసిపోతోంది. ప్రకాశించే రూపసౌందర్యంతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. లెహంగా, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో మతిపోగొట్టింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

ఇక రకుల్ కేరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా హోదా సంపాదించుకోవడం విశేషం. టాలీవుడ్ సినిమాలతో అగ్ర స్థాయి హీరోయిన్ల జాబితాలో చోటుదక్కించుకుంది. మరోవైపు తన అందం, అభినయంతో లక్షల్లో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. 

తెలుగులో కొన్నేండ్లుగా అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో దుమ్ములేపుతోంది. రకుల్ నటించిన ఐదు చిత్రాలు  గతేడాది విడుదలవడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ కావడంతో రకుల్ కు నార్త్ లో గట్టి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. దీంతో ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నారు. 
 


మరోవైపు రకుల్ సౌత్ ఆడియెన్స్ కు కూడా దగ్గరగానే ఉండేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో తమిళంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘భారతీయుడు 2’లో కమల్ సరసన  నటిస్తున్నారు. కాజల్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
 

ఇదిలా ఉంటే.. తెలుగులో మాత్రం రకుల్ ఎలాంటి సినిమాలకు సైన్ చేయడం లేదు. చివరిగా ‘కొండపొలం’తో అలరించింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’లో రకుల్ నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటోంది. అలాగే తమిళంలో నిర్మిస్తున్న ‘అయాలన్’లోనూ నటిస్తోంది.
 

Latest Videos

click me!