డైవర్స్ నోట్‌లో వందన షా, వారి అసోసియేట్స్ చెబుతూ, పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత సైరా తన భర్త రెహ్మాన్ నుంచి విడిపోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకుంది. వారి రిలేషన్‌లో చాలా భావోద్వేగ ఒత్తిడి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ ఒకరిపై ఒకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, అనేక టెన్షన్స్, ఇబ్బందులు తమ మధ్య అధిగమించలేని దూరాన్ని పెంచాయి. గ్యాప్‌ని సృష్టించాయి. ఈ సమయంలో ఎవరూ వీరిని కలిపే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. సైరా చాలా వేదనతో, ఎంతో బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. సైరా తన జీవితంలోని ఈ కష్టమైన అధ్యాయాన్ని ఫేస్ చేస్తున్నందుకు ఈ క్లిష్ట సమయంలో వారి గోప్యతకి సహకరిస్తారని ప్రజలను కోరుతుంది` అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ నోట్ వైరల్ అవుతుంది.