కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే అంటోనీ ఎవరు? ఏం చేస్తుంటాడు..? షాకింగ్ విషయాలు

First Published | Nov 19, 2024, 9:37 PM IST

నటి కీర్తి సురేష్ తన  ప్రియుడు ని పెల్ళాడబోతుంది అని వార్త వైరల్ అవుతున్న క్రమంలో.. అతను ఎవరు..? ఏం చేస్తుంటాడు అని అంతా సెర్చ్ చేస్తున్నారు.ఇంతకీ కీర్తికి కాబోయే భర్త ఏం చేస్తారు..? 

ఈమధ్య సెలబ్రిటీలు అంతా తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెపుతున్నారు. రీసెంట్ గా  నటి రమ్య పాండియన్ పెళ్ళి జరగ్గా.. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. వీరి తర్వాత హీరోయిన్  కీర్తి సురేష్ కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు  గుడ్ బై చెప్పనుంది.

Also Read: 1000 కోట్ల సినిమా చేసినా సింపుల్ గా కనిపించే డైరెక్టర్ చిన్ననాటి ఫోటో, ఎవరో గుర్తు పట్టారా..?
 

కీర్తి సురేష్ వివాహ తేదీ

కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త అంటోనీ తట్టిల్‌ను గోవాలో రహస్యంగా వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి - అంటోనీ వివాహం డిసెంబర్ 11, 12 తేదీల్లో జరుగుతుందని, దీనికి కీర్తి, అంటోనీల కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.

కీర్తి వివాహం గురించిన వార్త బయటకు వచ్చినప్పటి నుంచి, ఆమెను వివాహం చేసుకునే అంటోనీ తట్టిల్ ఎవరు..? అతను ఏం చేస్తుంటాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. డీటెయిల్స్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

Also Read: కిరణ్ అబ్బవరం కి అల్లు అర్జున్ బహిరంగ క్షమాపణ. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?


కీర్తి సురేష్, అంతోనీ తట్టిల్

కీర్తి 15 ఏళ్ల ప్రియుడు అంటోనీ ఎవరో చూద్దాం, "కేరళకు చెందిన అంటోనీ తట్టిల్ ప్రస్తుతం కొచ్చి, దుబాయ్‌లలో ప్రముఖ వ్యాపారవేత్త. కైపలాత్ హబీబ్ ఫరూక్‌తో కలిసి చెన్నైలో నమోదైన ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్‌కు ప్రధాన యజమాని. కేరళ, దుబాయ్‌లలో ఆయనకు కోట్లలో ఆస్తులున్నాయని చెబుతున్నారు.

కీర్తి చలాకీగా ఉండే అమ్మాయి అయితే, అంటోనీ ఆమెకు పూర్తిగా వ్యతిరేకం. చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి అట. కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం అతనికి. అందుకే ఆమె ఏది కోరుకున్న తను అడ్డు చెప్పడట. 

Also Read: కొడుకు గుగన్ దాస్ వింత అలవాటు గురించి శివ కార్తికేయన్ చెప్పిన సీక్రెట్

కీర్తి సురేష్ కాలేజీ స్నేహితుడితో వివాహం

స్కూల్ రోజుల నుంచి కీర్తికి మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ... కొచ్చిలో డిగ్రీ చదువుతున్నప్పుడు తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు. చాలా ఏళ్లుగా ఈ జంట తమ ప్రేమను రహస్యంగా ఉంచి, ఎక్కడా బయటపెట్టలేదు. కీర్తి - అంటోనీల 15 ఏళ్ల ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారబోతుందని సమాచారం. 

కీర్తి సురేష్ కుటుంబం

హీరోయిన్ గా  కీర్తి సురేష్  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతుంది. తెలుగులో ఆమె నటించిన మహానటి సినిమాకు ఏకంగా  జాతీయ అవార్డు కూడా వరించింది.  బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఇక ఈసినిమా   డిసెంబర్ 25న విడుదల కానుంది.
 

బాలనటి కీర్తి సురేష్

కీర్తి సురేష్ నటి మేనక, నిర్మాత జి. సురేష్ కుమార్ కుమార్తె. 2000ల ప్రారంభంలో మలయాళంలో బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ..  కొన్నేళ్ల తర్వాత సినిమాల్లో హీరోయిన్‌గా నటించడం మొదలుపెట్టింది. గీతాంజలి చిత్రంలో నటించినందుకు ఉత్తమ తొలి నటిగా SIIMA అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత జాతీయ అవార్డుతో సహా అనేక అవార్డులు గెలుచుకుంది.

Latest Videos

click me!