AR Rahman
AR Rahman Discharged From Apollo Hospital : 58 ఏళ్ల సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ఈరోజు ఉదయం 7.30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. రెహ్మాన్‌కి ఏమైందని కలవరపడ్డారు. అయితే దీనికి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. రెహ్మాన్ డిశ్చార్జ్ అయ్యారట.
అపోలో ఆసుపత్రి ప్రకటన
కొన్ని పరీక్షల అనంతరం ఏ.ఆర్.రెహమాన్ ఇంటికి తిరిగి వెళ్లారని అపోలో ఆసుపత్రి తెలిపింది. దీనికి ముందు ఛాతీ నొప్పి వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ డీ హైడ్రేషన్ సమస్య వచ్చిందని, దీంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు వైద్యలు తెలిపారు. రొటీన్ చెకప్‌లో భాగంగా కొన్ని టెస్ట్ లు చేసి డిశ్చార్జ్ చేశారట. ప్రస్తుతం ఆయన అరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఏ.ఆర్.రెహమాన్
కొంతకాలం క్రితం రెహమాన్ మాజీ భార్య సాయిరా భానుకు కూడా ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.