అల్లు అర్జున్‌ అతి నమ్మకమే దెబ్బ కొట్టింది.. `వరుడు` డిజాస్టర్‌కి అసలు కారణం ఇదే!

Published : Mar 16, 2025, 01:09 PM IST

Allu Arjun-Varudu Movie: అల్లు అర్జున్‌ ఎంతో నమ్మి చేసిన మూవీ `వరుడు`. కానీ ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. దీనికి గల కారణాలను వెల్లడించారు రైటర్‌ తోట ప్రసాద్‌. బన్నీ నమ్మకమే తేడా కొట్టిందా?  

PREV
15
అల్లు అర్జున్‌ అతి నమ్మకమే దెబ్బ కొట్టింది.. `వరుడు` డిజాస్టర్‌కి అసలు కారణం ఇదే!
allu arjun, varudu movie

Allu Arjun-Varudu Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవల `పుష్ప 2`తో సంచలన విజయం సాధించారు. ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే బన్నీ కెరీర్‌లో చాలా సినిమాలు డిజాస్టర్‌ అయ్యాయి. వాటిలో `వరుడు` ఒకటి. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ నిరాశ పరిచింది. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ అలరించడంలో ఫెయిల్‌ అయ్యింది. 

25
varudu movie

గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన `వరుడు` చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన భాను శ్రీ మెహ్రా హీరోయిన్‌గా నటించింది. ఆర్య విలన్‌గా నటించాడు. ఐదు రోజుల పెళ్లి వేడుక ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్‌ ఎవరో చివరి వరకు చూపించలేదు టీమ్‌. డైరెక్ట్ సినిమాలో చూపించాలని ఆ సస్పెన్స్ పెట్టారు. ఇదే సినిమా కొంప ముంచింది. 

35
varudu movie

అయితే అల్లు అర్జున్‌ బలంగా నమ్మింది ఏంటంటే సెకండాఫ్‌ బ్లాస్ట్ అవుతుందని, ఆడియెన్స్ సర్‌ప్రైజ్‌ అవుతారని భావించారు. ఎందుకంటే హీరోయిన్‌ని పెళ్లిలో అప్పుడే చూపిస్తారు. అది అల్లు అర్జున్‌కే కాదు, ఆడియెన్స్ కి సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని భావించింది టీమ్‌.

బన్నీ నమ్మకం కూడా అదే. కానీ సెకండాఫ్‌ మొత్తం పెళ్లి వైపు కాకుండా యాక్షన్‌ వైపు టర్న్ తీసుకుంటుంది. విలన్‌ వచ్చి పెళ్లి పీఠల మీద నుంచి హీరోయిన్‌ని ఎత్తుకుపోతాడు. తనకు కాబోయే భార్య కోసం అల్లు అర్జున్‌ విలన్‌ని వెంటాడటం, ఇద్దరి మధ్య పోరాటం ఉంటుంది. 

45
thota prasad

కానీ ఆడియెన్స్ మాత్రం సినిమా అంతా పెళ్లి చుట్టూ ఉంటుందని, పెళ్లి వేడుకని కొత్తగా చూపిస్తారని, అది ఎలా చూపిస్తారో చూడాలనే ఆతృతతో ఉన్నారు. కానీ అ సన్నివేశాలు లేవు. దీంతో డిజప్పాయింట్‌ అయ్యారు.

దీనికితోడు హీరోయిన్‌ ఎవరో సస్పెన్స్ లో పెట్టడంతో ఎంత అందంగా ఉంటుందో అని అంతా భావించారు. కానీ హీరోయిన్‌ కూడా అంత అందంగా అనిపించకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారని చెప్పారు ఈ మూవీకి రైటర్‌గా పనిచేసిన తోటప్రసాద్‌. ఆర్‌టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

55
varudu movie

అయితే సినిమా షూటింగ్‌ మధ్యలోనే దర్శకుడు గుణశేఖర్‌కి తేడా కొట్టిందట. మనం చూపిస్తున్నది ఒకటి, ఆడియెన్స్ కి రీచ్‌ అవుతున్నది మరోటి. ఇది ఎక్కడికో వెళ్లిపోతుందనిపించిందట. బన్నీ మాత్రం సెకండాఫ్‌ బాగా వర్కౌట్‌ అవుతుందనుకున్నారట. కానీ ఆయన నమ్మకం రివర్స్ అయ్యింది. 2010 మార్చి 31న విడుదలై ఈ సినిమా దారుణంగా డిజాస్టర్‌ అయ్యింది. 

read  more: గౌతమ్‌ హీరోగా మహేష్‌ బాబు, కృష్ణలతో సినిమా.. స్టార్‌ డైరెక్టర్‌ మైండ్‌ బ్లాక్‌ చేసే ప్లాన్‌, కానీ

also read: ఈ ఒక్క రోజు కోసం 25ఏళ్లు నరకం చూశా, శివాజీ ఎమోషనల్‌.. ఇక నా టైమ్‌ మొదలైంది

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories